Living Apart Together : అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో మూడింట రెండు వంతుల మంది వివాహానికి ముందు కలిసి జీవించడం జంటలకు శాశ్వత సంబంధాన్ని, శాశ్వతమైన వివాహాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి భారతదేశంలోనూ కనిపిస్తోంది. నగరాల్లోనూ చాలా మంది లివింగ్ టుగెదర్ అంటే సహజీవనం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.


ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా పెళ్లైన కొన్ని నెలలు, సంవత్సరాలకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటని అధిగమించేందుకు యూత్ ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా సహజీవనం వంటి పద్దతిపై ఆధారపడుతున్నారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. 


సహజీవనం అంటే..


సహజీవనం అంటే పెళ్లికి ముందే ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో కలిసి ఉండటం. ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుందని చాలా మంది నమ్ముతారు. దీని వల్ల అనేక లాభాలున్నాయని భావిస్తారు. సహజీవనం చేస్తే ఇద్దరి అలవాట్లు, అభిరుచులు, బలహీనతలు తెలుస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను కొంతవరకైనా అంచనా వేయవచ్చు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వారి కంటే ఈ వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాలు సూచిస్తున్నారు. అయితే సహజీవనం కన్నా ముందు ఇది మీకు సరైనదా, ప్రయోజనాలు, నష్టాలను పరిగణించడం చాలా ముఖ్యం. మీరు, మీ భాగస్వామితో ఓపెన్ గా, నిజాయితీగా కమ్యూనికేట్ చేయగలగడం అత్యంత ఆవశ్యకం.


లివ్ ఇన్ రిలేషన్ సక్సెస్ కావాలంటే



  • లివ్ ఇన్ రిలేషన్ కు నమ్మకం అనేది మూలస్తంభం లాంటింది. నమ్మకం లేకుండా జీవించడం వల్ల అపార్థాలు, అభద్రత, అస్థిరతకు దారితీస్తుంది. సమయం తక్కువ ఉన్నప్పటికీ.. ఉన్న సమయాన్ని విలువైనదిగా మార్చుకోవాలి. కలిసి గడిపేందుకు ప్రాధాన్యతనివ్వాలి.

  • ఒక హెల్దీ రిలేషన్షిప్ ను కొనసాగించడానికి ఒకరికొకరు రోజుకు 45 నిమిషాల నుండి ఒక గంట లేదా వారానికి 5-7 గంటల సమయం కేటాయించుకోవాలి. ఈ విధానాన్ని భాగస్వాములిద్దరూ సమానంగా అమలుచేయాలి.

  • కలిసి జీవించాలని ప్లాన్ చేస్తున్నప్పుడు సరిహద్దులను నిర్ణయించడం చాలా అవసరం. ఆర్థిక విషయాలు, చర్చించలేని అంశాలు, అంచనాలు, మీరు పర్సనల్ స్పేస్, భాగస్వామ్య సమయాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటారు అనే విషయాల గురించి ముందుగానే చర్చించాలి.

  • ఏ విషయంలోనైనా ఇద్దరూ స్పష్టమైన అంచనాలను కలిగి ఉండాలి. మీరు ఏ బాధ్యతలను పంచుకోవాలనుకుంటున్నారో చర్చించుకోవడం చాలా ముఖ్యం. సరైన కమ్యూనికేషన్ లేకపోతే ఏ రిలేషన్ లో అయినా గొడవలు, ఇబ్బందులు తలెత్తుతాయి.

  • కొన్నిసార్లు కలిసి గడపడం సాధ్యం కాకపోతే చాటింగ్, వీడియో కాల్ ల ద్వారా కనెక్ట్ అవ్వడం లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి.

  • ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలను పంచుకునేటప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకోకుండా.. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. వారి మానసిక స్థితికి తగ్గట్టుగా ఓదార్పునివ్వాలి.

  • ఫైనల్ గా, లివ్ ఇన్ రిలేషన్ సెటప్‌కు పరిపక్వత, పరస్పర అవగాహన, స్వతంత్రతను బాధ్యతాయుతంగా నిర్వహించగల సామర్థ్యం చాలా అవసరం.


ఈ ట్రెండ్ ఇండియాలో సక్సెస్ అవుతుందా..


పాశ్చాత్య దేశాలలో జనాదరణ పొందిన ధోరణి లివింగ్ అపార్ట్ టుగెదర్ (LAT) అనేది ఇప్పుడు భారతదేశానికీ వ్యాపించింది. ఇటీవలి కాలంలో చాలా మంది కపుల్స్ చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. ఇందుకు ఉద్యోగాల పేరుతో హస్బెండ్స్ నగరాలకు వెళ్లడం, భార్యలు ఊళ్లలో లేదా వారికి దూరంగా ఉండాల్సి రావడం వంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది జంటలు, ముఖ్యంగా మెట్రో నగరాల్లో, డిమాండ్‌తో కూడిన ఉద్యోగాలు, సుదీర్ఘ ప్రయాణాలు లేదా వేర్వేరు ప్రదేశాల్లో కుటుంబాలను పోషించాల్సిన అవసరం కారణంగా ఇప్పటికే వేరుగా నివసిస్తున్నారు. ఉదాహరణకు, నోయిడా, గుర్గావ్ మధ్య రాకపోకలు సాగించేవారు తరచుగా వారంలో విడివిడిగా జీవించడాన్ని ఎంచుకుంటున్నారు. సమయం, శక్తిని ఆదా చేసేందుకు వారాంతాల్లో మాత్రమే వెళుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్నిసార్లు ఈ పద్దతి సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.


ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో దీనికి అంతగా ప్రాబల్యం లేదు. తప్పుగా చూస్తారు. ఫలితంగా అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనా సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అంచనాలను మార్చేయచ్చు. ఈ జీవనశైలిని అనుసరించే జంటలు సైతం గొడవలు పడొచ్చు, విడిపోవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే దేశంలో ఈ తరహా సంబంధాలు సక్సెస్ కావాలంటే ఇంకా చాలా టైం పట్టొచ్చు. ఇప్పట్లో అయితే అంతగా హిట్ కావనే చెప్పాలి.


Also Read : 2025 Resolution : న్యూ ఇయర్ రెజల్యూషన్​గా డిటాచ్​మెంట్.. లైఫ్​లో బెస్ట్ రిజల్ట్స్​ కావాలంటే దీనిని ఫాలో అయిపోండి