Happy New Year 2025: abp దేశం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు


కొత్త ఏడాదిలో మొదటి రోజు రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు ఆఫీసులో భావోద్వేగపరమైన నిర్ణయాలు తీసుకోకండి. మీరు మీ సమయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోగలుగుతారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.  ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 


వృషభ రాశి


ఈ రోజు సానుకూల ఆలోచనలతో ఉంటారు. మీరు మీ లక్ష్యంపై పూర్తి దృష్టిని కొనసాగించాలి. ఉన్నతాధికారులు మీ పనితీరుకి ప్రశంసలు అందస్తారు.  మీ ప్రత్యర్థులు మిమ్మల్ని విమర్శించినప్పటికీ. మనసులో తెలియని భయం ప్రభావం ఉంటుంది. 


మిథున రాశి


ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. మధ్యాహ్నానికి ముందే ముఖ్యమైన పనులు పూర్తి చేయండి. స్థిరాస్తి క్రయ, విక్రయాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. వైవాహిక సంబంధాలలో ఒత్తిడులు తొలగిపోతాయి.  


కర్కాటక రాశి


ఈ రోజు న్యాయపరమైన విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో సంతోషంగా ఉంటారు. ధార్మిక పనులపై ఏకాగ్రత వహిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు 


Also Read: జనవరి 2025 ఈ రాశులవారికి కొత్త కొత్తగా ఉంటుంది - మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది!


సింహ రాశి


ఈ రోజు మీరు నూతన ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి. త్వరిత ప్రతిస్పందనలు ఇవ్వడం మానుకోండి. మీరు వెతుకుతున్న అవకాశాలు మీకు లభించవచ్చు. మత్తు పదార్థాలు సేవించే వారికి ఇబ్బందులు పెరుగుతాయి. మీ విజయాలతో మీరు అసంతృప్తి చెందవచ్చు.


కన్యా రాశి


ఈ రోజు కెరీర్‌కు సంబంధించి అందరి నుంచి సలహాలు ఆశిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటారు. సకాలంలో పనులన్నీ పూర్తిచేస్తారు.  విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నాయి జాగ్రత్త.
 
తులా రాశి 


ఈ రోజు విద్యార్థులు తమ చదువుల గురించి ఆందోళన చెందుతారు.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలు వేసుకుంటారు.  ప్రేమ సంబంధాల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు పొందుతారు.


Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!


వృశ్చిక రాశి


ఈ రోజు  శుభవార్త వింటారు.  కార్యాలయ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. నిర్మాణ పనుల్లో వేగం ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు.  కుటుంబ సభ్యులతో కూర్చుని తీవ్రమైన విషయాల గురించి చర్చిస్తారు ప్రభుత్వ పనుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.  


ధనస్సు రాశి


ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. రోజంతా ఆనందంగా ఉంటారు. స్నేహితులకు సమయం కేటాయిస్తారు. భగవంతుడిపై నమ్మకం తగ్గుతుంది. అనుకోని అతిథులను కలుస్తారు.


మకర రాశి


ఈ రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేయకండి. కార్యాలయంలో అధికారుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీరు మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాన్ని పొందవచ్చు. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనిని మళ్లీ ప్రారంభిస్తారు.


కుంభ రాశి


ఈ రోజు ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటారు. కొన్ని కారణాల వల్ల మానసికంగా బాధపడతారు. కొత్త వ్యక్తులతో చనువుగా ఉండొద్దు.  మీ దినచర్య  లో చాలా మార్పులుంటాయి. వ్యాపారులు నష్టపోతారు. 


మీన రాశి


ఈ రాశివారు ఈ రోజు శుభవార్త వింటారు.  మీపై కుటుంబ సభ్యులకు ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ జీవిత భాగస్వామికోసం సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. 


Also Read: నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025.. ఈ శ్లోకాలతో చెప్పేయండి..