Breastfeeding Myths : బిడ్డకు తల్లిపాలు అనేది అత్యంత ఉత్తమమైన పోషకాహారం. కానీ సమాజంలో తల్లిపాలు పట్టడంపై అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహల కారణంగా కొందరు పిల్లలకు పాలు ఇవ్వడంలో కన్​ఫ్యూజ్ అవుతారు. అందుకే నిపుణులను సంప్రదించి తల్లిపాలు పట్టడంపై ఉన్న సందేహాలను, అపోహలను క్లియర్ చేసుకోవడం ముఖ్యం. ఈ అంశంపై ముంబైలోని ఘట్‌కోపర్‌కు చెందిన ఎండీ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ అవి సంఘ్వి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. 

Continues below advertisement

తల్లిపాలు ఎందుకు ముఖ్యం..

బిడ్డకు సంపూర్ణ పోషణ అందించడానికి, వారి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధికి తల్లిపాలు చాలా ముఖ్యం. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం కోలుకోవడానికి ఇది సహాయపడటమే కాకుండా.. భవిష్యత్తులో కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే తల్లిపాలకు సంబంధించి ఎన్నో అపోహలు చాలామందిలో ఉన్నాయి. అవేంటో.. వాటికి నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటో తెలుసుకుందాం. 

Also Read : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే

Continues below advertisement

అపోహ : రొమ్ములు చిన్నగా పాలు తక్కువగా వస్తాయి.

వాస్తవం: రొమ్ము పరిమాణానికి, తల్లి పాల ఉత్పత్తికి నేరుగా సంబంధం లేదు. ఒక తల్లి ఉత్పత్తి చేసే పాల పరిమాణం, ఆమె బిడ్డ ఎంత తరచుగా పాలు తాగుతుంది, రొమ్ము నుంచి పాలు ఎంత సమర్థవంతంగా విడుదలవుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అపోహ : తల్లికి జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉంటే చనుబాలు ఇవ్వకూడదు.

వాస్తవం: చాలా సాధారణ అనారోగ్యాలు ఉన్నా కూడా తల్లిపాలు ఇవ్వడం కొనసాగించవచ్చు. తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు శిశువును వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయి.

అపోహ : ఫార్ములా పాలు తల్లి పాలంత మంచివి.

వాస్తవం: తల్లిపాలలో యాంటీబాడీలు, ఎంజైమ్‌లు, అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని ఫార్ములా పాలలో పూర్తిగా పునఃసృష్టించడం సాధ్యం కాదు. మీరు మీ బిడ్డకు ఫార్ములా పాలు ఇవ్వాలనుకుంటే.. డాక్టర్ సూచించిన విధంగా మాత్రమే ఇవ్వాలి. 

Also Read : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే

అపోహ : బిడ్డకు తల్లిపాలతో పాటు నీళ్లు కూడా ఇవ్వాలి.

వాస్తవం : కేవలం తల్లిపాలు మాత్రమే తాగే బిడ్డకు మొదటి ఆరు నెలల వరకు అదనపు నీరు అవసరం లేదు. బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ.. కేవలం తల్లిపాలు మాత్రమే తాగే బిడ్డకు మొదటి ఆరు నెలల వరకు అదనపు నీరు అవసరం ఉండదు.

అపోహ : బిడ్డకు పళ్లు రావడం మొదలైన తర్వాత తల్లిపాలు ఇవ్వడం ఆపేయాలి.

వాస్తవం : పళ్లు రావడం అనేది తల్లిపాలు ఆపడానికి ఒక కారణం కాదు. చాలా మంది పిల్లలు పళ్లు వస్తున్నప్పుడు కూడా బాగా పాలు తాగగలరు. క్రమంగా కొరుకుతున్నప్పుడు పాలు తాగకుండా ఉండటం నేర్చుకుంటారు.

అపోహ : పాలిచ్చే తల్లులు అనేక రకాల ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి.

Also Read : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వాస్తవం : చాలా మంది తల్లులు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లు, పప్పుధాన్యాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కూడిన సమతుల్య, వైవిధ్యమైన ఆహారాన్ని తినవచ్చు. అయితే అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో అనవసరంగా ఎలాంటి పెద్ద మార్పులు చేయవలసిన అవసరం లేదు.

అపోహ : బిడ్డ తరచుగా తల్లిపాలు తాగుతుంటే.. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

వాస్తవం : తరచుగా తల్లిపాలు ఇవ్వడం సాధారణం. ఇది తల్లి శరీరంలో పాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శిశువు ఎదుగుదల వేగంగా ఉండే సమయంలో తల్లిపాల ఉత్పత్తికి తరచుగా తల్లిపాలు ఇవ్వడం ఎంతో ప్రయోజనకరం.

అపోహ : తల్లిపాలు ఇచ్చేటప్పుడు నొప్పి రావడం సాధారణం.

వాస్తవం : మీరు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు మీకు కొంత నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు. అయితే తల్లిపాలు ఇచ్చిన తర్వాత కూడా లేదా రెండుసార్ల మధ్య కూడా నొప్పి కొనసాగితే.. మీ బిడ్డకు సరిగ్గా పాలు పట్టడం లేదని అర్థం. అటువంటి సందర్భాలలో, లాక్టేషన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం ముఖ్యం.

Also Read : సంతానోత్పత్తి సమస్యలు రాకూడదంటే మహిళలు, పురుషులు తీసుకోవాల్సిన ఫుడ్స్.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేవారికి బెస్ట్

అపోహ : ఉద్యోగం చేసే తల్లి తన బిడ్డకు పాలివ్వకూడదు.

వాస్తవం : సరైన ప్రణాళికతో తల్లిపాలను సరిగ్గా పిండి, నిల్వ చేసుకోవడం ద్వారా, ఉద్యోగం చేసే చాలా మంది తల్లులు తమ పిల్లలకు విజయవంతంగా తల్లిపాలు ఇవ్వడం కొనసాగించగలరు.

అపోహ : బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వడం ఆపాలి .

వాస్తవం : సాధారణంగా ఆరు నెలల వయస్సులో ఇతర అనుబంధ ఆహారాలతో పాటు తల్లిపాలు పట్టడం ప్రారంభిస్తారు. అయితే వైద్యుని సలహాను బట్టి, తల్లిపాలను రెండు సంవత్సరాల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగించవచ్చు.

మీకు కూడా తల్లి పాలు ఇవ్వడంలో ఇలాంటి డౌట్స్ ఉంటే వెంటనే వాటికి చెక్ పెట్టి వైద్యుల సూచనలతో పిల్లలకు పాలు ఇవ్వండి. 

Also Read : ప్రెగ్నెన్సీ ఎలా జరుగుతుంది.. గర్భధారణలో ముఖ్యమైన ఈ మూడు దశలు మీకు తెలుసా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.