Bloating vs Belly Fat Symptoms and Causes : ఉదయం లేవగానే పొట్ట మామూలుగా ఉండి.. సాయంత్రానికి ఉబ్బినట్లు కనిపిస్తోందా? లేదా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? అయితే ఈ రెండింటినీ చాలామంది ఒకటిగానే భావిస్తారు. కానీ పొట్ట ఉబ్బరం, బెల్లీ ఫ్యాట్ రెండూ వేర్వేరు సమస్యలు. వీటికి కారణాలతో పాటు.. వీటిని తగ్గించుకునే పద్ధతులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. మరి ఈ రెండింటి మధ్య తేడాలు ఎలా గుర్తించాలో? పొట్ట ఉబ్బరం, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.

Continues below advertisement

పొట్ట ఉబ్బరం 

పొట్ట ఉబ్బరం అంటే కడుపు నిండుగా, బిగుతుగా ఉన్నట్లు అనిపించడం. కొన్నిసార్లు పొట్ట బయటకు వచ్చినట్లు కనిపించవచ్చు. గ్యాస్, మలబద్ధకం, కొన్ని ఆహారాలు పడకపోవడం, వేగంగా తినడం వంటి కారణాలతో ఈ సమస్య రావచ్చు. మరికొందరికి నెలసరి సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా పొట్ట ఉబ్బరం కనిపిస్తుంది.

Also Read : పొట్ట (Belly Fat), బరువును తగ్గించడంలో హెల్ప్ చేసే 7 రకాల జ్యూస్​లు ఇవే.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి 

Continues below advertisement

బెల్లీ ఫ్యాట్

బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు. ఇది చర్మం కింద ఉండవచ్చు. అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఈ కొవ్వు అధికంగా ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరగవచ్చు.

పొట్ట ఉబ్బరం, బెల్లీ ఫ్యాట్ మధ్య తేడాలు ఇవే

పొట్ట ఉబ్బరం ఉంటే రోజులో వేర్వేరు సమయాల్లో పొట్ట పరిమాణం మారవచ్చు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఉబ్బినట్లు కనిపించవచ్చు. బెల్లీ ఫ్యాట్ ఉంటే పొట్ట ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఉబ్బరం ఉంటే గ్యాస్, తేన్పులు, పొట్ట నిండిన భావన, కడుపులో అసౌకర్యం ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారిలో జీర్ణ సమస్యలు నేరుగా రావు.

Also Read : జిమ్ చేసినా పొట్ట తగ్గట్లేదా? అయితే ఈ 5 సూప్స్​తో చెక్ పెట్టండి.. ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీలు ఇవే

కొన్ని ఫుడ్స్ తిన్న తర్వాత పొట్ట ఉబ్బరం ఎక్కువ కావచ్చు. ఉదాహరణకు కొంతమందికి పాలు, కూల్ డ్రింక్స్, పప్పులు లేదా కొన్ని కూరగాయలు ఇబ్బంది కలిగించవచ్చు. బెల్లీ ఫ్యాట్ మాత్రం ఒక్క భోజనం వల్ల వెంటనే పెరగదు. ఎక్కువ కేలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ ఎక్కువ కాలం లేకపోవడం వల్ల పొట్ట రావచ్చు. ఉబ్బరం కారణాన్ని బట్టి కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో తగ్గవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మాత్రం ఆహారం, వ్యాయామం, నిద్రలో కచ్చితమైన మార్పులు చేస్తే.. నెలల తర్వాత ఫలితం కనిపించవచ్చు.

పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి టిప్స్

పొట్ట ఉబ్బరం తగ్గించుకోవాలంటే.. ఆహారం నెమ్మదిగా తీసుకోవాలి. వేగంగా తింటే కొంతమందిలో గ్యాస్ సమస్య పెరగవచ్చు. అలాగే భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు నడవడం మంచిది. మీకు ఏ ఆహారం పడటం లేదో గుర్తించండి. ఏం తిన్నారు, ఎప్పుడు లక్షణాలు వచ్చాయో తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది. శరీరానికి సరిపడా నీరు తీసుకోవడం, ఫైబర్‌ను పెంచుకోవడం మంచిది. సోడా వంటివి తాగితే గ్యాస్ పెరిగి ఉబ్బరం రావచ్చు. కాబట్టి వీటిని కంట్రోల్ చేయండి. 

Also Read : ప్రతిరోజూ మెంతుల నీరు తాగితే పొట్ట తగ్గుతుందా? నిపుణుల సూచనలు ఇవే

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే..

బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని మానేయడం కంటే రోజులో ఎంత, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో గుర్తించాలి. మీ ఆకలి, శారీరక శ్రమకు తగ్గట్టుగా బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, చేపలు లేదా చికెన్ వంటివి క్రేవింగ్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

వ్యాయామం చేయడం కుదరకపోతే.. భోజనం తర్వాత నడవడం, లిఫ్ట్‌కు బదులుగా వీలైనప్పుడు మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మధ్యమధ్యలో లేచి కదలడం అలవాటు చేసుకోండి. నడకతో పాటు వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయండి. స్క్వాట్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు చేయవచ్చు. నిద్రను కూడా లైట్ తీసుకోకూడదు. క్రాష్ డైట్స్ ఫాలో అవ్వకపోవడమే మంచిది. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..

పొట్ట ఉబ్బరం తరచుగా వస్తున్నా, తగ్గకుండా కొనసాగుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, మలంలో రక్తం, కారణం తెలియకుండా బరువు తగ్గడం, మలంలో మార్పులు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

Also Read : కడుపు క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఇవే.. గ్యాస్, అజీర్ణం, పొట్ట నొప్పితో పాటు మరెన్నో

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.