Juices To Reduce Belly Fat Weight Loss : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నారా ? అయితే మీరు సమతుల్యమైన ఆహారం, రెగ్యులర్​ వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు.. పోషకాలు అధికంగా ఉండే కొన్ని జ్యూస్‌లు డైట్లో చేర్చుకోవాలి. ఇవి మీరు బరువు తగ్గే ప్రయత్నానికి మరింత హెల్ప్ కావచ్చు. ఎందుకంటే ఈ జ్యూస్​లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పొట్టను తగ్గించడంలో సహాయపడతాయి. అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

ముల్లంగి జ్యూస్

ముల్లంగిలో కేలరీలు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో ఉపయోగపడతాయి. అలాగే నీటి శాతం అధికంగా ఉండటంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నీరు నిల్వ ఉండే సమస్యను తగ్గించడంలో కూడా ముల్లంగి ఉపయోగపడవచ్చు.

Continues below advertisement

Also Read :  బరువు పెరిగిపోతున్న పిల్లలు, ఊబకాయ నివారణే మార్గం.. లేకుంటే ముప్పే, డాక్టర్ ముఫ్జల్ సూచనలివే

గ్రీన్ జ్యూస్

పాలకూర, కీరదోసకాయ, నిమ్మరసంతో తయారుచేసుకునే గ్రీన్ జ్యూస్ పోషకాలతో నిండిన ఉంటుంది. పాలకూరలో ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కీరదోసకాయ శరీరానికి తేమను అందిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలు అందించే ఈ జ్యూస్ పొట్ట తగ్గించడంలో హెల్ప్ చేయవచ్చు. 

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్‌లో సహజమైన నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడంలో, వ్యాయామ సమయంలో శక్తిని పెంచడంలో సహాయపడవచ్చు. దీంతో వ్యాయామ సామర్థ్యం పెరిగి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. బీట్‌రూట్‌లో పీచు పదార్థం కూడా ఉండటంతో జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వ్యాయామానికి ముందు పరిమిత మోతాదులో తీసుకుంటే మంచిది.

Also Read : బరువు తగ్గడానికి మెడిటరేనియన్ డైట్ బెస్ట్.. ఈజీగా ఫాలో అవుతూ ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చట

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్‌లో బీటా కెరోటిన్, విటమిన్-ఎ, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కళ్ల ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. క్యారెట్‌లో ఉండే పీచు పదార్థం కడుపు నిండిన భావన కలిగించి అధికంగా తినకుండా సహాయపడుతుంది. తీపి పదార్థాలు తినాలనే కోరికను కూడా తగ్గించవచ్చు.

నిమ్మ,అల్లంతో గ్రీన్ జ్యూస్

నిమ్మకాయ, అల్లం, పాలకూర లేదా కేల్ వంటి ఆకుకూరలతో తయారుచేసే ఈ జ్యూస్ ఆరోగ్యానికి మంచి ఎంపిక. అల్లం జీర్ణక్రియకు, నిమ్మకాయ విటమిన్-సిని అందించి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుకూరల్లో ఉండే పోషకాలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఈ జ్యూస్ ఆరోగ్యకరమైన డైట్‌లో భాగంగా తీసుకోవచ్చు.

Also Read : బిర్యానీ తిన్నా బరువు పెరగకూడదంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. నిపుణుల సూచనలివే

దానిమ్మ జ్యూస్

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడవచ్చు. ఇందులో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ.. పరిమిత మోతాదులోనే దీనిని తీసుకోవాలి. తాజా దానిమ్మతో ఇంట్లో తయారుచేసిన జ్యూస్‌ను తీసుకోవడం మంచిది.

గ్రీన్ ఆపిల్ జ్యూస్

గ్రీన్ ఆపిల్‌లో ఇతర రకాల ఆపిల్స్‌తో పోలిస్తే చక్కెర కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. 

Also Read : శంఖం పువ్వులతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. బరువు తగ్గడం నుంచి చర్మ సంరక్షణ వరకు, రెసిపీ ఇదే

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

జ్యూస్‌లలో పీచు పదార్థం ఉండదు. కాబట్టి వీలైతే పండ్లు, కూరగాయలను నేరుగా తినడం ప్రాక్టీస్ చేయండి. చక్కెర లేదా తేనె కలపకుండా తాజా జ్యూస్‌ను చేసుకుంటే వెంటనే తాగేయడం మంచిది. జ్యూస్ మాత్రమే తాగితే బరువు తగ్గకపోవచ్చు కానీ బ్యాలెన్స్డ్ డైట్, వ్యాయామం, తగినంత నిద్రతో తీసుకుంటే మంచి ఫలితాలు చూడగలుగుతారు. మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదిస్తే మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.