సాధారణంగా రాత్రివేళ్లలో దుస్తులతోనే నిద్రపోతాం. కానీ, కొందరికి శరీరం మీద నూలు పోగు కూడా లేకుండా నిద్రపోవడం అలవాటు. అలాంటివారు చాలా అరుదుగా ఉంటారు. కుటుంబంతో కలిసి జీవించేవారిలో ఈ అలవాటు తక్కువే. ఒంటరిగా లేదా పార్టనర్‌తో కలిసి జీవించేవారిలో నగ్నంగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాటు వినేందుకు కాస్త చిత్రం.. చెత్తగా కూడా అనిపించవచ్చు. కానీ, పరిశోధకులు మాత్రం నగ్నంగా నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి, అవేంటో చూసేద్దామా. 


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న సమస్య నిద్రలేమి. ఇందుకు కొన్ని అనారోగ్య కారణాలే కాకుండా.. అతిగా టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం కూడా నిద్రలేమి సమస్యలకు కారణమవుతోంది. నిద్రలేమి నుంచి బయటపడేందుకు చాలామంది మాత్రలను వాడుతున్నారు. వాటిని అలవాటు చేసుకోవడం మరింత ప్రమాదకరం. అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొందరు నగ్నంగా నిద్రపోతున్నారు. ఇలాంటి నిద్రను తప్పుగా భావించకూడదు. ఎందుకంటే.. దాన్ని పసిపిల్లల నిద్రగా భావిస్తారు. అప్పుడే పుట్టిన పిల్లలకు దుస్తులు వేయకుండా దుప్పట్లు కప్పి నిద్రపుచ్చినట్లుగానే.. వీరు నిద్రిస్తారు. మన దేశంలో కేవలం 2 శాతం మంది మాత్రమే ఇలా నగ్నంగా నిద్రపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, అమెరికా వంటి దేశాల్లో ప్రతి 100 మందిలో 40 మంది నగ్నంగా నిద్రపోతారట. మరి నగ్నంగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా. 


⦿ దుస్తులు ధరించకుండా నగ్నంగా నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. రక్తం త్వరగా చల్లబడుతుంది. కాబట్టి మీరు త్వరగా నిద్రపోవచ్చు.
⦿ నగ్నంగా బెడ్ మీద వాలిపోతే.. గాఢనిద్రలోకి జారుకోవచ్చట. 
⦿ రోజంతా దుస్తులు ధరించడం వల్ల చర్మంలోని కణాల పునరుద్ధరణకు కష్టమవుతుంది. దుస్తులు తీసి నిద్రపోతేనే అది సాధ్యమవుతుంది. దీనివల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
⦿ బిగుతుగా ఉండే దుస్తులు ఎక్కువ ఒత్తిడిని ఇస్తాయి. నగ్నంగా పడుకోవడం వల్ల ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
⦿ నగ్నంగా నిద్రపోవడం ద్వారా అధిక బరువును నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
⦿ నగ్నంగా నిద్రించడం వల్ల శరీరంలో సిర్కాడియన్ సైకిల్స్‌తో సహా దాని సహజ నిద్రను అందింకే ప్రక్రియ యాక్టీవ్‌ అవుతుంది.
⦿ నగ్నం నిద్రపోవడం వల్ల మహిళల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయని గైనకాలజిస్టులు తెలుపుతున్నారు. 
⦿ రాత్రి వేళల్లో ఇన్నర్స్ వేసుకుని నిద్రపోవడం వల్ల ఈస్ట్ వంటి ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయని తెలుపుతున్నారు.
⦿ నగ్నంగా నిద్రపోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఉండవట. అండర్ వేర్, షార్ట్స్ లేదా లుంగీల వల్ల పురుషాంగానికి గాలి తగలదు. దాని వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట. 


Also Read: సైలెంట్‌గా ఉండేవారు అంత డేంజరా? ఈ కారణాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు!


నష్టాలూ ఉన్నాయ్: నగ్నంగా నిద్రపోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయట. దుస్తులతో నిద్రపోయేవారితో పోల్చితే.. నగ్నంగా పడుకొనేవారి బెడ్ చాలా అపరిశుభ్రంగా ఉంటుందట. వారు ఎప్పటికప్పుడు బెడ్ షీట్స్, దుప్పట్లను మార్చకపోతే.. హానికరమైన బ్యాక్టరీయే ఏర్పడే ప్రమాదం ఉందట. అంతేకాదు.. సాధారణ వ్యక్తి రోజులో 15 నుంచి 25 సార్లు గ్యాస్ వదులుతాడు. నిద్రపోయినప్పుడే ఇది ఎక్కువగా జరుగుతుంది. గ్యాస్ వదిలినప్పుడు.. మల పదార్థం కూడా బయటకు వస్తుంది. శరీరంపై దుస్తులు ఉంటే.. దాన్ని అడ్డుకుంటుంది. అవి లేకపోతే.. నేరుగా బెడ్ మీదకే అవి చేరుతాయి. అలాంటి బెడ్ మీద పడుకోవడం వల్ల అలర్జీలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే బెడ్ మీద ఉండే దుమ్ము కణాలు, బ్యాక్టీరియా కూడా అలర్జీలు, వ్యాధులకు కారణం కావచ్చు. చలికాలంలో నగ్నంగా నిద్రపోవడం అంత మంచిది కాదు. శరీరం అత్యధికంగా చలికి గురికావడమే కాకుండా.. ఆ కాలంలో ఏర్పడే వైరస్‌లను సులభంగా గ్రహిస్తుంది. కాబట్టి.. ఇవన్నీ గుర్తుపెట్టుకొనే మీరు నగ్నంగా నిద్రపోవాలా.. లేదా అనే నిర్ణయం తీసుకోవాలి. 


Also Read: రోజూ స్నానం చేయడం లేదా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్: స్టడీ


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.