పెరుగు ఆరోగ్యానికి మంచిదే. నిత్యం పెరుగును ఆహారంగా తీసుకుంటే.. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. అయితే, చాలామంది పెరుగులోకి ఏదో ఒకటి కలుపుకుని తింటారు. నంజు లేనిదే.. పెరుగన్నం తినడం కష్టంగా భావిస్తారు. అయితే, పెరుగుతో కొన్ని ఆహారాలను కలిపి తినడం మంచిది కాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, అవేంటో చూద్దామా.  


పెరుగు-చేపలు: పెరుగు, చేపలు కలిపి తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. దీని వల్ల అజీర్ణంతోపాటు గ్యాస్, ఎసిడిటీ ఏర్పడుతుంది. కాబట్టి ఆ రెండు కలిపి అస్సలు తినొద్దు. పెరుగు, చేపలు ఆరోగ్యానికి మంచివే. కానీ, కలిపి తింటే మాత్రం సమస్యలు తప్పవు. ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది. 


మామిడి-పెరుగు: మామిడి పండు శరీరానికి వేడి చేస్తుంది. అలాగే.. పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి.. ఈ సారి పెరుగు, మామిడి పండును తినేప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.  


కందిపప్పు-పెరుగు: కంది పప్పు కూడా శరీరానికి వేడి చేస్తుంది. పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, లూజ్ మోషన్‌(జిగట విరోచనాలు)కు దారి తీస్తుంది. 


పెరుగు-పాలు: పెరుగు తయారయ్యేది పాలతోనే అనే సంగతి మనకు తెలిసిందే. అయితే, పాలు పెరుగుగా మారిన తర్వాత తన స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి.. పెరుగు, పాలను కలిపి తినప్పుడు ఆ రెండు విరుద్ధంగా పనిచేస్తాయి. అవి మన జీర్ణ వ్యవస్థకు హాని చేస్తాయి. గ్యాస్, ఆమ్లత్వం వల్ల వాంతులు ఏర్పడే అవకాశం ఉంది. గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. 


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!


పెరుగు-ఉల్లి: చాలామంది పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. దీనివల్ల అలెర్జీ, గ్యాస్, అసిడిటీ, వాంతులు కలిగిస్తాయి. అయితే, నిత్యం వీటిని తీసుకొనేవారికి పెద్ద సమస్య ఉండదు. శరీర క్రమేనా అందుకు అలవాటు పడుతుంది. కానీ, కొత్తగా ఈ కాంబినేషన్ అలవాటు చేసుకోడానికి ప్రయత్నిస్తే మాత్రం.. సమస్యలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగు శరీరానికి చలవ చేస్తుంది. అయితే, ఉల్లిపాయ అందుకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఇవి రెండు కలవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా వేసవిలో ఈ రెండు కలిపి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.  


గమనిక: వివిధ అధ్యయనాలు, నిపుణులను సూచనలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. మీరు ఏదైనా డైట్ పాటించే ముందు వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలతో ‘ఏబీపీ దేశం, ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యులు కాదని గమనించగలరు.


Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి