శాకాహారులు, వీగన్లు ఎప్పటికప్పుడు ప్రొటీన్ ఏ శాకాహారంలో ఎక్కువగా దొరుకుతుందో వెతుకుతూనే ఉంటారు. వీరికి చాలా సులభంగా ఎక్కువ ప్రొటీన్ దొరికేది సోయా నుంచి. మరి అది నిజమేనా అంటే కొంచెం అనుమానమే. ఎందుకో ఒకసారి చూద్దాం.


సోయా మంచి పోషకాహారం


సోయాబీన్స్ లో మినరల్స్, ప్రొటీన్స్, విటమిన్ బి కాంప్లెక్స్, ఫైటిక్ యాసిడ్లు పుష్కలం. రెడ్ మీట్ ఇతర ప్రాసెస్డ్ మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించదగిన ఆహారం. కానీ చాలా మంది చంక్స్ లేదా గ్రాన్యూల్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. సోయా తీసుకునేందుకు ఇది సరైన పద్దతి కాదని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.  ముఖ్యంగా సోయా గ్రాన్యూల్స్ లేదా సోయా చంక్స్‌లో మైదా కూడా ఉంటుందని చెబుతున్నారు. జపాన్ ప్రజలు తీసుకునే ఫెర్మెంటెడ్ సోయా మాత్రమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


ఫెర్మెంటెడ్ సోయా బెటర్


ఫెర్మెంటేషన్ (పులియబెట్టిన) సోయా జీర్ణక్రియలో అసౌకర్యాన్ని కలిగించే యాంటీ న్యూట్రియెంట్ లక్షణాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఫెర్మెంటెడ్ సోయా త్వరగా జీర్ణమవుతుంది. పులిసిన సోయా సెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అంతేకాదు అందులోని పోషకాల నాణ్యత కూడా మెరుగవుతుంది. టెంఫ్, మీసో, డోన్జాంగ్, డౌడే, నాటో రూపాల్లో సోయా తీసుకోవడం అన్నింటి కంటే ఉత్తమం. అందుకే ఫెర్మెంటెడ్ సోయా ఎప్పుడైనా తినేందుకు అనువైనది నిపుణులు చెబుతున్నారు. ఇతర కూరగాయల మాదిరిగానే సోయాలో కూడా థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. థైరాయిడ్ పనితీరు సరిగా ఉంటే ఇతర అన్ని హార్మోన్లు కూడా సరిగ్గా పనిచేస్తాయి. సోయా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఓవరాల్ హెల్త్ మీద మంచి ప్రభావం ఉంటుందనేది ఆమె అభిప్రాయం.


ఫైటిక్ ఆసిడ్


ఫైటిక్ యాసిడ్ అనేది ఒక యాంటీ న్యూట్రియెంట్. అవసరమైన మినరల్స్‌ను పట్టి ఉంచడానికి లేదా తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆహారంలో ఎక్కువగా తీసుకున్న మినరల్స్‌‌ను బయటకు పంపేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే సోయాను నేరుగా తినడం వల్ల శరీరంలో మినరల్స్ నిల్వలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కాల్షియం శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి సోయాను నేరుగా తీసుకోవడం అంతమంచిది కాదు. తప్పకుండా సోయా ఫెర్మెంటెడ్ ఫాం(పులియబెట్టడం)లో తీసుకోవాల్సి ఉంటుంది.


ఫెర్మెంటేషన్ వల్ల లాభాలు


ముడి సోయా ఎప్పుడైనా ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్నే చూపుతుంది. కాబట్టి ఫెర్మెంట్ చేసిన సోయా తీసుకోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం. ఫెర్మెంటేడ్ రూపంలో ఎంజైమ్ ఇన్హిబీటర్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఫైటిక్ ఆసిడ్‌ను న్యూట్రల్ చేసే ఫేటేట్ కూడా ఇందులో తయారవుతుంది. సోయాలో సహజంగా ఉండే గొయిట్రోజెనిక్ లక్షణాలు కూడా ఫెర్మెంటెడ్ రూపంలో తగ్గిపోతాయి. పులిసిన సోయాను తక్కువ మోతాదులో వాడుతారు. సోయాబీన్స్ రుచి, ప్రొటీన్ బెనిఫిట్స్ కావాలంటే తప్పనిసరిగా దాన్ని ఫెర్మెంట్ చేసి మాత్రమే తీసుకోవడం మంచిదనేది నిపుణుల సలహా. 


Also read: ఇంటి దగ్గరే ఆర్గానిక్ హోలీ రంగులు, ఏ రంగును ఎలా తయారుచేయాలంటే