సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరో హీరోయిన్ లు రాజకీయాల్లోకి వస్తుంటారు. ఇది ఎప్పటినుంచో వస్తోన్న సాంప్రదాయమే. అలాగే చాలా మంది సెలబ్రెటీలు రాజకీయాల్లో తమ సత్తా చాటుకున్నారు కూడా. కొంత మంది పార్టీలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపడితే.. కొందరు వేరే పార్టీలలో చేరి ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో సరిపెట్టుకున్నారు. తమిళనాడులో స్వర్గీయ ఎంజీఆర్, జయలలిత వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. తరువాత ఆ కోవలో చాలా మంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాట టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార రాజకీయాల్లోకి వస్తుందా అనే వార్తలు ఈ మధ్య బలంగా వినిపిస్తున్నాయట. సోషల్ మీడియాలో నయనతార ఎంపీ అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.


ఇటీవల నూతన సంవత్సరం సందర్బంగా నయన్-విఘ్నేష్ లు ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు పక్కన ఉండే అభాగ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది ఈ జంట. అంతే కాదు.. దంపతులిద్దరూ వారి దగ్గరకు వెళ్లి నూతన సంవత్సర కానుకలను పంచిపెట్టారు. సినిమా సెలబ్రెటీలు తమ వద్దకు వచ్చి గిప్ట్ లు ఇవ్వడంతో అక్కడున్న వారంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు.. ‘‘నయన తార మనసు చాలా మంచిదని, ఇలాంటి సేవా గుణం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఆమె రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొందరు కనీసం రాజ్య సభ సీటు ఇచ్చైనా ఆమె సేవలను విస్తరించేలా సహకరించాలని అంటున్నారు. మరికొందరు మాత్రం ఎంపీ సీటు కోసమే కదా ఇదంతా అంటూ సెటైర్లు వేస్తున్నారు.



తమిళనాట లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. తమిళంలో అత్యధిక పారతోషికం తీసుకుంటున్న నటి కూడా ఈమే. దీంతో ఆమె సినీ గ్లామర్ ను వినియోగించుకోవాలని చూస్తున్నాయట రాజకీయ పార్టీలు. అందుకే నయనతార రాజకీయాల్లోకి వస్తుందంటూ గతం నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. తమిళనాట చాలా మంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అందులో అందరూ పాలిటిక్స్ లో నిలదొక్కుకోలేకపోతున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు భయపడుతుంటే, కమల్ హాసన్, విజయ్ కాంత్, శరత్ కుమార్, ఖుష్బూ తదితరులు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నయనతార రాజకీయాల్లోకి రావడం సరైంది కాదని కొంతమంది ఫ్యాన్స్ అంటుంటే.. ఇంకొంత మంది మాత్రం నయనతార రాజకీయాల్లో రానించగలదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు నయనతార లాంటి వాళ్ల సినీ గ్లామర్ ను వినియోగించుకోవడానికి రాజకీయ పార్టీలు ఎవరి ప్లానింగ్ లో వాళ్లు ఎప్పుడూ ఉంటారు. మరి తమిళనాట రాజకీయాల్లోకి నయనతార అడుగుపెడుతుందో లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి నయనతార సినిమాల్లో బిజీగా ఉంది. ఆమె ఇటీవల నటించిన సినిమా ‘కనెక్ట్’. ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలై పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. 





Read Also: ఇండియాపై పాక్ కుట్ర - ఆ హీరోయిన్లతో హనీ ట్రాపింగ్, నటి సజల్ అలీ పాత్రేంటి?