ప్రపంచవ్యాప్తంగా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కష్టతరంగా మారుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కాలుష్య కారకంగా కూడా మారుతుంది. అందుకే విద్యుత్ ఉత్పత్తిలో పర్యావరణ అనుకూలమైన మార్గాలను వెతుకుతున్నారు. అందుకే సోలార్ పవర్ కి జనాదరణ పెరుగుతోంది. దీని వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సౌర శక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం అనేది చాలా చవకైన పద్ధతి. సోలార్ విద్యుత్ వాడకం కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే, సౌర క్షేత్రాలను నిర్మించడానికి లేదా ఆపరేట్ చేయడానికి ఉపయోగించే సాంకేతికత చుట్టుపక్కల జీవిస్తున్న వారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందేమో అని కొంతమందిలో భయం ఉంది.
సౌర శక్తిని వినియోగించుకోవడానికి సాధారణంగా ఉపయోగించే సాంకేతికతను ఫోటోవోల్టాయిక్ (PV) సాంకేతికత అని పిలుస్తారు. దీన్ని ఇళ్లు పైకప్పులపై పెట్టే సౌర ఫలకాలలో ఉపయోగిస్తారు. సూర్యుడు విడుదల చేసే సౌర కిరణాల నుంచి PV సాంకేతికత ఆ రేడియేషన్‌ను గ్రహించి విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్‌ను బ్యాటరీలలో నిల్వ చేయవచ్చు లేదా పవర్ గ్రిడ్‌కు తిరిగి అందించవచ్చు. సోలార్-థర్మల్ పవర్ (CSP) అని పిలిచే మరొక రకమైన సౌర సాంకేతికత సౌర శక్తిని విద్యుత్తుగా మార్చడానికి అద్దాలను ఉపయోగిస్తుంది. CSP ప్రధానంగా పెద్ద పవర్ ప్లాంట్లలో ఉపయోస్తారు.
క్యాన్సర్‌కు కారణమవుతుందా?
యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన అధ్యయనకర్తలు మాట్లాడుతూ సోలార్ ప్యానెల్‌లు క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. చాలా మందికి సోలార్ ప్యానెల్స్‌ను ఇంటి పైకప్పుపై అమర్చినప్పటికీ వాటితో నేరుగా సంబంధం ఉండదని అన్నారు. కాబట్టి సోలార్ ప్యానెల్ ఉపయోగించడానికి భయపడవద్దని వివరించారు. వాస్తవానికి, సోలార్ ప్యానెల్‌లు, సోలార్ ఫామ్‌లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని అన్నారు. చాలా సౌర ఫలకాలను ఎక్కువగా గాజు, అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు ప్లాస్టిక్ ఉపయోగించి తయారు చేస్తారు.సూర్యరశ్మిని సంగ్రహించడానికి ఉపయోగించే సోలార్ ప్యానెల్స్‌లోని కణాలు సిలికాన్‌తో తయారు చేస్తారు. సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా క్యాన్సర్ కారకం అని భయపడేవారు ఉన్నారు. ఇక్కడ విడుదలయ్యేది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్. సోలార్ ఫారమ్ సమీపంలో నివసించే వారికి కొన్ని రకాల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. దృష్టి సమస్యలు, తలనొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంది.
Also read: మానసిక ఆందోళనను తగ్గించే కుంకుమ పువ్వు, తరచూ తింటే ఇంకెన్నో లాభాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.