బీహార్లోని ఒక మహిళ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలతో అసాధారణమైన శిశువు జన్మించింది. అయితే ఆ పాప ఎక్కువ సమయం జీవించలేదు. ప్రసవించిన కాసేపటికే మరణించింది. పాపకు ఉన్న రెండు గుండెలు ఆరోగ్యంగానే కొట్టుకుంటున్నాయి. ఆ శిశువు తల్లికి ఇది తొలి ప్రసవం. సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీశారు. బిడ్డ మరణించినప్పటికీ తల్లి క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇలా పిల్లలు అసాధారణంగా ఎందుకు జన్మిస్తారో వైద్యులు వివరిస్తున్నారు.


అసాధారణ జననాలు ఎందుకు?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,అదనపు అవయవాలు కలిగి ఉండడం అనే సమస్యను పాలీమెలియా అంటారు. ఇలా అదనపు అవయవాలతో బిడ్డలు జన్మించడం ప్రతి పది లక్షల జననాలతో ఒకరిలో జరుగుతుంది. ఇలా పుట్టుకతో లోపాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యు ఉత్పరివర్తనలు, పిండం అసాధారణంగా అభివృద్ధి చెందిన సందర్భాలలో ఇలా జరుగుతూ ఉంటుంది. శిశువుల్లో  అదనపు అవయవాలు చురుకుగా పెరుగుతాయి. పాలీమెలియా అనే పరిస్థితికి చికిత్స చేయడం అసాధ్యం. రెటినోల్ టాక్సిసిటీ, క్రోమోజోమ్ లోపాలు వల్ల కూడా గర్భస్థ శిశువుల్లో పాలిమెలియా వచ్చే అవకాశం ఉంది. అవయవాల వైకల్యంతో జననాలు ప్రతి పదివేల జననాలలో ఆరింటిలో కలిగే అవకాశం ఉంది.  పాలీమెలియాలో నాలుగు రకాలు నోటోమెలియా, సెఫలోమెలియా, థొరాకోమెలియా, పైగోమెలియా. ఒక్కో రకం ఒక్కోరకమైన సమస్యను కలిగిస్తుంది. 



పాలీమెలియా ముందుగా నిర్ధారణ చేయవచ్చా?
గర్భం ధరించాక ఆరోనెలలో టిఫా స్కాన్ వంటివి చేస్తారు. ఇది అవయవాలు సవ్యంగా, క్రమ పద్ధతిలో పెరిగాయో లేదో చెక్ చేస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలను ఈ స్కాన్లో అంచనా వేయచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది అందుబాటులో లేదు. పైగా వారిలో స్కాన్ వంటివి చేయించుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు. దీని వల్ల ప్రసవంలోనే వారికి అదనపు అవయవాలు పెరిగిన విషయం తెలుస్తుంది.  ముందుగా గుర్తిస్తే కొన్ని పద్ధతుల ద్వార ఆర్ధోపెడిక్ సర్జరీ వంటి చికిత్సలు చేయవచ్చు. దీనికి ప్రినేటల్ డయాగ్నసిస్ అవసరం. అవయవాల లోపాలు కనిపెట్టేందుకు, పిండం అసాధారణతలను నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్, సోనోగ్రఫీ వంటి పరీక్షలు చేయించాలి. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా MRI వంటి పరీక్షల ద్వారా పిండం అవయవాల అసాధారణతలను గుర్తించవచ్చు. పిండం అనాటమీ, పాథాలజీకి సంబంధించిన పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల వైకల్యాలను గుర్తించడానికి ఇప్పుడున్న సాంకేతికత పెద్దగా ఉపయోగపడదు. 



Also read: లిచీ పండ్లను డయాబెటిస్ రోగులు తింటే ఏమవుతుంది?



Also read: మానసిక ఆందోళనను తగ్గించే కుంకుమ పువ్వు, తరచూ తింటే ఇంకెన్నో లాభాలు
































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.