తెలంగాణలోని లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్‌-2023, పీజీ ఎల్‌‌సెట్‌-2023 పరీక్షల ఫలితాలు నేడు (జూన్ 15) విడుదల కానున్నాయి. ఫలితాలను జూన్‌ 15న సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 30కి పైగా న్యాయకళాశాల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,218 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 25,747 మంది పోటీ పడ్డారు.  


పరీక్ష అర్హత మార్కులు: 
➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
➥ పీజీఎల్‌సెట్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.


ఫలితాల కోసం వెబ్‌సైట్: https://lawcet.tsche.ac.in/