గుప్పెడంత మనసు జూన్ 15 ఎపిసోడ్
రిషిని అవమానించేందుకు కేడీ బ్యాచ్ పేడనీళ్లు చల్లాలని ప్లాన్ చేస్తాడు. అది కనిపెట్టిన రిషి ఆ పేడనీళ్లను పాండ్యన్ బ్యాచ్ తో క్లీన్ చేయిస్తాడు. వేరే స్టూడెంట్స్ తో క్లీన్ చేయించాలని కేడీ బ్యాచ్ ప్రయత్నించినా రిషి వెనక్కు తగ్గడు. తమ ఓటమిని జీర్ణించుకోలేని కేడీ బ్యాచ్ రిషిపై కోపంతో రగిలిపోతుంటారు. వారి ఆలోచనల్ని గ్రహించిన రిషి మరోసారి అందరికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత లెక్చరర్స్ అంతా కూర్చుని ఇప్పుడు సంతోషంగా, ధైర్యంగా ఉందని మాట్లాడుకుంటారు. ఇకపై ఆ కేజీ బ్యాచ్ మీ విషయంలో తలదూర్చరు, వాళ్లని మారుస్తానని హామీ ఇస్తాడు రిషి. అందరూ భోజనం చేస్తుంటే రిషి క్యాంటీన్ కి వెళ్లాలి అనుకుంటాడు. అంతలో మీరు కూడా మాతో పాటే తినండి అని అందరూ అడుగుతారు. అప్పుడే రూమ్ లోకి వచ్చిన వసుధార ఇబ్బందిగానే రిషి పక్కన కూర్చుంటుంది. సైలెంట్ గా ఉన్న వసుధారని ఓ లెక్చరర్ క్వశ్చన్ చేస్తుంది.
Also Read: ఈగోమాస్టర్ ఈజ్ బ్యాక్, వసుకి క్లారిటీ - కేడీ బ్యాచ్ కి పెద్ద షాక్ ఇచ్చిన రిషి!
మీరు గతంలో ఏ కాలేజీలో వర్క్ చేసేవారు, ఈ సిటీలోనే చేశారా..సమాధానం చెప్పకపోవడంతో ఏం అడిగినా వెంటనే చెబుతారు కానీ రిషి సార్ ఉన్నప్పుడు మాట్లాడరెందుకు, మీకు రిషి సార్ కి ఇంతకుముందే పరిచయం ఉందా అని అడుగుతుంది. ఇక్కడే పరిచయం అని అబద్ధం చెప్పేస్తాడు రిషి. అందరు పెట్టింది తిన్న రిషి వసుధార ఇచ్చింది మాత్రం కావాలనే కింద పడేస్తాడు. ఒక్క తప్పు వల్ల తన జీవితం మొత్తం తలక్రిందులైందని వసుధార మనసులోనే బాధపడుతుంది. తమ ప్లాన్స్ ఫెయిల్ అవడంతో కేడీ బ్యాచ్ రగిలిపోతుంటారు. ఈ సారి పెద్ద ప్లాన్ తో రిషిని అవమానించాలని ఫిక్స్ అవుతారు. మరోవైపు లంచ్ టైమ్ లో తన పక్కన కూర్చున్న వసుపై ఫైర్ అవుతాడు రిషి.
రిషి: మాటకు ముందు ఓ అబద్ధం...మాట తర్వాత ఓ అబద్ధం ..నువ్వు అబద్దాలు చెబుతూనే బతికేస్తావు. ఎందుకిలా చేస్తున్నావు
వసుధార: నిజం చెబుతున్నాను నన్ను నమ్మండి
రిషి: ఏమోషనల్ గా ఏదో చెప్పబోయే వసు మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటాడు రిషి, నిన్ను నమ్మినందుకే నాపై నిందపడింది. దోషిగా మారానంటాడు. నాపై చెరగని మచ్చపడింది. చివరకు మనుషులపై నమ్మకం పోయేలా చేశారు. ఇన్నింటికి కారణమైన నిన్ను ఎలా నమ్మాలి
వసు: కన్నీళ్లు పెట్టుకున్న వసుధార మీరు దూరమైన తర్వాత జీవితం మొత్తం తలక్రిందులైందంటూ.. తన తల్లి చనిపోయిన విషయం రిషితో చెప్పాలని అనుకుంటుంది. కానీ రిషి వినడు. నువ్వు మీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నాను. నన్ను మాత్రం తన తండ్రికి దూరంగా చేశావు. నీ మాటలను వినాల్సిన అవసరం నాకు లేదు.
వసు: మీ కోసమే, మీ క్షేమం కోసమే అబద్ధం ఆడాను
రిషి: తప్పులు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయడం. అది బయటపడితే క్షమాపణ కోరడం ఇదే కదా నీ వ్యక్తిత్వం. ఇలాగే కదా నువ్వు బతికేది . అసలు ప్రేమంటే, నమ్మకం అంటే ఏమిటో నీకు తెలియదు. తెలిస్తే నన్ను ఇబ్బంది పెట్టవు. నిన్ను చూడటం, నీతో మాట్లాడటం ఇష్టం లేదని చెప్పినా సిగ్గు లేకుండా నా వెంట పడి బాధపెడుతున్నావు . నువ్వు, జగతి మేడం కలిసి చేసిన తప్పుకు నాతో పాటూ నా తండ్రికి కూడా శిక్ష పడిందని రిషి ఎమోషనల్ అవుతాడు. తాను దోషిననే నిజం తెలిసి ఆయన ఏమైపోయారో, తన కోసం ఎక్కడ వెతుకుతున్నారో అంటూ రిషి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను మా నాన్నకు దూరం చేసినందుకు మీకో దండం అంటూ... పక్కవాళ్లకు డౌట్ వస్తుందని నాతో మాట్లాడటానికి ట్రై చేయొద్దని వసుధారకు వార్నింగ్ ఇస్తాడు.
వసుధార ఎంత కన్వీన్స్ చేయాలని ట్రై చేసినా రిషి మాత్రం ఆమె మాటలను పట్టించుకోడు.
రిషి: నాకు దగ్గర కావాలని ప్రయత్నించవద్దు. ఇంతకుముందు నా మనసును చంపేశావు. ఇప్పుడు నన్ను చంపేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రిషి మాటలతో వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి, వసుధార మాటల్ని చాటునుంచి పాండ్యన్ వింటాడు. రిషిపై రివేంజ్ తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరికిందని సంతోషపడతాడు.
Also Read: 4 నెలల పాటూ ఈ రాశులవారికి అత్యద్భుతంగా ఉంది!
తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ ద్వారా వసుధార అడ్రెస్ కనుక్కుంటాడు మహేంద్ర. వసుధారను వెతుక్కుంటూ ఆమె పనిచేస్తోన్న కాలేజీకి వస్తాడు. కాలేజీలోకి వస్తోన్న మహేంద్రను రిషి చూస్తాడు. తండ్రిని చూసిన ఆనందం పట్టలేక డాడ్ అని పిలుస్తాడు. కానీ దోషిగా ముద్రపడిన తనను చూసి తండ్రి తట్టుకోలేడని భావించి అతడికి కనిపించకుండా దాక్కుంటాడు. రిషి పిలిచినట్లుగా అనిపించడంతో మహేంద్ర వెనక్కి తిరిగిచూస్తాడు. కానీ అక్కడ అతడికి ఎవరు కనిపించరు. ఆ తర్వాత తాను వసుధారను కలవడానికి కాలేజీకి వచ్చానని ఆమె ఎక్కడుందని అక్కడి వారిని అడుగుతాడు మహేంద్ర. వసుధార మీకు ఏమవుతుందని వారు అడగ్గానే తడబడుతూ సమాధానం చెబుతాడు. వారి మాటల్ని చాటునుంచి రిషి వింటాడు.
గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది