అభిమన్యు వసంత్ ఇంటికి వచ్చి తన మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరిస్తాడు. మీరు నన్నేమి చేయలేరు కానీ మర్యాదగా నీ పెళ్ళాంతో కేసు విత్ డ్రా చేయించు లేదంటే మీలో ఒక్కొక్కరినీ పైకి పంపిస్తానని అంటాడు. అంత వరకు నువ్వు ఉంటే కదా అని వసంత్ పక్కనే ఉన్న కత్తి తీసుకుని పొడవబోతుంటే అభి చేత్తో కట్టి పట్టుకుంటాడు. చిత్ర తనని వెనక్కి లాగుతుంది. ఆడపిల్ల జీవితాలతో ఆడుకునే వీడు ప్రాణాలతో ఉండకూడదని వసంత్ ఆవేశపడతాడు. నన్నే పొడుస్తావా? మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను నా మీద కేసు పెట్టిన యష్, వేద ఎలా హ్యపీగా ఉంటారో చూస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఖుషి నిద్రలేచి ఈరోజు నా బర్త్ డే అని ఇంట్లో వాళ్ళకి గుర్తు ఉందా లేదా అని యష్ దగ్గరకి వస్తుంది. ఇంట్లో అందరినీ ఈరోజు స్పెషల్ ఏంటని అడుగుతుంది. మాలిని గుర్తుకు వచ్చింది ఈరోజు అట్లతద్ది అని అంటుంది. నా పుట్టినరోజు ఎంతో గ్రాండ్ గా జరిపిస్తారని అనుకుంటే ఇలా చేస్తారా?ని బుంగమూతి పెడుతుంది.


Also Read: దివ్య మీద చెయ్యెత్తిన విక్రమ్- రాజ్యలక్ష్మి కుట్ర తెలుసుకున్న తులసి


మీరు మర్చిపోయారు నేను హర్ట్ అయ్యానని వెళ్తుంటే పై నుంచి గులాబీ పూల వర్షం పడుతుంది. అందరూ తనకి విశేష్ చెప్తారు. మాళవిక ఖుషి దగ్గరకి వచ్చి బర్త్ డే విశేష్ చెప్పి బెలూన్ ఇస్తే తీసుకోకుండా ఉంటుంది. నువ్వే మర్చిపోయావ్ అనుకున్నాం గ్రాండ్ గా పార్టీ సెలెబ్రేట్ చేద్దామని అనుకున్నట్టు చెప్తారు. సులోచన, మాలిని లుడో ఆడుకుంటూ ఉండగా మాళవిక వచ్చి ఆదిత్య కనిపించాడా అని అడుగుతుంది. ఆదిత్య ఈ ఇంటి మనవడు ఎవరూ ఎత్తుకెళ్లలేరని సులోచన కౌంటర్ ఇస్తుంది. కాసేపు మాళవికని ఇన్ డైరెక్ట్ గా తిట్టుకుంటారు. వేద అందంగా రెడీ అయి అద్దంలో చూసుకుంటుంటే యష్ వస్తాడు. అప్పుడే వేద బ్లౌజ్ హుక్ ఊడిపోతుంది. వేదని కూర్చోబెట్టి చక్కగా పిన్ కుట్టేస్తాడు. పనిలో పనిగా రొమాన్స్ మొదలుపెట్టేస్తారు. హుక్ కుట్టినందుకు థాంక్స్ చెప్తుంది. థాంక్స్ ఎవరికి కావాలి ఫీజుగా ముద్దు కావాలని అంటాడు.


Also Read: కృష్ణ పాచిక పారలేదు- భార్యాభర్తలుగా హోమం చేసిన మురారీ దంపతులు, చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ముకుంద


ఆదిత్యని రెడీ చేస్తూ పార్టీకి చాలా మంది వస్తారు. వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని మాళవిక అంటుంది. తెలుసు ఇంట్లో నుంచి పంపించేస్తారు కానీ ఇక్కడ అలా ఏమి అనిపించడం లేదు. అందరూ మనం ఇంట్లో ఉండాలనే అనుకుంటున్నారని ఆదిత్య చెప్తాడు. కానీ మాళవిక మాత్రమ అలాగే అనిపిస్తుంది ఎవరూ మొహం మీద పొమ్మని చెప్పరు వాళ్ళ ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలని విషం నూరిపోస్తుంది. సూట్ వేసుకుని టై కట్టుకోవడం రాకపోయేసరికి మాళవిక వెళ్ళి తనే టై ముడి వేయించి తీసుకొస్తానని చెప్తుంది. యష్ తో మాట మాట కలపాలన్నా ఇలాంటి చిన్న చిన్నవి అడ్డం పెట్టుకుని వెళ్లాలని అనుకుంటుంది. అక్కడ యష్, వేద రొమాన్స్ లో మునిగిపోతారు. నువ్వు నా బిడ్డకి తల్లిగా ఈ ఇంటికి కోడలిగా చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశావు. బాధ్యతలు ఎప్పుడు బంధాలకు కట్టుబడి ఉండాలని అంటారని యష్ అనేసరికి వేద యష్ ని కౌగలించుకుంటుంది. అప్పుడే మాళవిక వాళ్ళ గదికి వస్తుంది.