ప్రసాద్ ఇంత హఠాత్తుగా హోమం ఎందుకు చేస్తున్నారని రేవతిని అడుగుతాడు. భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్థలు ఉంటేనే ఈ హోమం జరిపిస్తారని సుమలత అంటుంది అందుకే అడిగానని చెప్తాడు. మురారీ వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిస్తే చులకనగా చూస్తారని రేవతి మనసులో అనుకుంటుంది. నా కొడుకు కోడలు బంధం శాశ్వతం అయితే ఈ ఇల్లు బృందావనమేనని సంతోషపడుతుంది. మేము విడిపోకూడదని అమ్మ హోమం చేయిస్తుంది, నిష్టగా చేస్తే నిజంగానే హోమం జరిగి మేము నిజమైన భార్యాభర్తలుగా మా బంధం శాశ్వతమవుతుందని మురారి అనుకుంటాడు. మీ అమ్మ మిమ్మల్ని కలపడానికి హోమం చేయిస్తుంది కానీ ఎన్ని చేసినా నీ మనసు మారాదని ఇంకోసారి గుర్తు చేయాలని ముకుంద తన దగ్గరకి వస్తుంది. అప్పుడే కృష్ణ కూడా మురారీ దగ్గరకి వస్తుంది. ఇంత మంచి మనిషి తొందరలో దూరం కాబోతున్నారని తెలిస్తే మనసు భారంగా మారుతుంది, నన్ను ప్రేమగా పలకరించేది మీరే, అందుకే ఆ డైరీ అమ్మాయి ఎవరో అడిగేయాలని కృష్ణ అనుకుంటుంది.
అటు కృష్ణ, ముకుంద ఒకేసారి మురారీ దగ్గరకి వస్తారు. ఏసీపీ సర్ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అంటుంది. ముకుంద కృష్ణ వైపు నుంచి నరుక్కుని రావాలని అనుకుంటుంది. అయితే మీరు మాట్లాడుకొండని వెళ్లబోతుంటే ఆపుతుంది.
Also Read: స్వప్నని కాపాడిన రాజ్- అసలు నిజం తెలుసుకున్న కావ్య పెళ్లిని ఆపుతుందా?
ముకుంద: కృష్ణ నువ్వు ఎవరినైనా లవ్ చేశావా? అదే పెళ్లికి ముందు
కృష్ణ: ప్రేమించలేదూ కానీ లవ్ స్టోరీ ఉంది అది ఏసీపీ సర్ కి తెలుసు. ఆ లవ్ స్టోరీ నా జీవితాన్ని మార్చేసిందని గతంలో శివయ్య చేసిన టార్చర్ చెప్తుంది. దీన్ని ఎవరైనా లవ్ అంటారా? ముకుంద నన్ను అడిగావ్ చెప్పాను నువ్వు ఆదర్శ్ ని పెళ్లి చేసుకునే ముందు ఒకరిని ప్రేమించి ఉంటావ్ ఇది నిజమా కాదా?
ముకుంద: నిజమే ఎక్కడ ఉంటాడో చెప్పను
కృష్ణ: ఎలా ఉంటాడో చెప్పు అనగానే ముకుంద మురారీ వైపు వేలు చూపిస్తుంది. అంటే మా ఏసీపీ సర్ లాగా ఉంటారా?
ముకుంద: అవును ఇలాగే ఉంటాడు ఇదే కలర్ ఇదే వెయిట్
కృష్ణ: ఇంక నయం ఏసీపీ సర్ అనలేదు. కొంపదీసి డైరీ అమ్మాయి ముకుందనే అనుకున్నా.. ఆ డైరీ అమ్మాయి ఎవరో ముకుంద ద్వారా అయినా తెలుసుకోవాలి
ఇద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఏసీపీ సర్ మా పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించారో అడగమని కృష్ణ ముకుందని అడుగుతుంది. మళ్ళీ ఇద్దరూ మురారీ దగ్గరకి వస్తారు.
ముకుంద: మురారీ నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా లవ్ చేశావా?
Also Read: వేదని అందరి ముందు దోషిని చేసిన మాళవిక- అభిమన్యుని కత్తితో పొడిచిన వసంత్
సమాధానం చెప్పమని కృష్ణ ఒత్తిడి తీసుకొస్తుంటే రేవతి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని గదుముతుంది. దీంతో మురారీ వెళ్ళిపోతాడు. ముకుంద తన గదిలో కూర్చుని మురారీ కృష్ణ ని తన భార్యగా హోమంలో కూర్చోవడానికి అసలు ఒప్పుకోడని అనుకుంటుంది. మురారీ మళ్ళీ డైరీ రాస్తాడు. నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎప్పుడూ బాధపడలేదు కానీ కృష్ణ ఎదురుగా ఉన్నా కానీ తన ఎడబాటు అంతగా అనిపించలేదని రాస్తాడు. తనకి ఇష్టం లేకుండా బలవంతంగా హోమంలో కూర్చుంటున్నారు ఏమో ఎలాగైనా హోమం జరగకుండా చూడాలని కృష్ణ రెవతితో మాట్లాడుతుంది.
కృష్ణని మాట్లాడనివ్వకుండా రేవతి ఏదో ఒకటి మాట్లాడుతూ పట్టించుకోకుండా ఉంటుంది. తనకి వేడి పడదని ఒంటి మీద రాషెస్ వస్తున్నాయని అబద్ధం చెప్పడానికి చూస్తుంది. మరి గంటల తరబడి స్టవ్ దగ్గర నిలబడి వంటలు ఎలా చేస్తున్నావని అడుగుతుంది.