Shani Vakri 2023 Effects: నవగ్రహాల్లో అత్యంత శక్తిమంతుడు శని యోగకారకుడిగా ఉంటే ఎంత మంచి జరుగుతుందో యోగకారకుడు కాకపోతే ఊహించనన్ని కష్టాలు వెంటాడుతాయి. గోచారరీత్యా శని 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతి ఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. శని ఒక్కో రాశిలో రెండున్నరేళ్ల చొప్పున సంచరిస్తాడు. నిన్నటి వరకూ కుంభంలో సంచరించిన శని ఇప్పుడు కూడా అదే రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. నవంబరు వరకూ తిరోగమనంలోనే ఉంటాడు. కర్మదాతగా పిలిచే శని..ఆయా వ్యక్తి కర్మల ప్రకారం మంచి చెడు ఫలితాలిస్తాడు. ఈ రాశులవారికి మాత్రం మంచి జరుగుతుంది. 


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


కుంభరాశిలో శని తిరోగమనం చేసిన వెంటనే మేషరాశి వారికి వరాలు కురిపిస్తాడు. ఈ సమయంలో మీరు మీ కెరీర్‌లో చాలా ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. అయితే ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శనిని న్యాయ దేవుడు అంటారు. అందుకే ఈ సమయంలో మీరు నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తారు. శని ఆశీస్సులు మీపై కచ్చితంగా ఉంటాయి. 


Also Read: మీ జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే పర్వాలేదు కానీ బలహీనంగా ఉంటే జీవితం నరకమే!


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


శని తిరోగమనం కారణంగా ఏర్పడిన కేంద్ర త్రిభుజ యోగం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాాదాలు)


శని తిరోగమనం వల్ల మిథునరాశివారికి చాలా కాలంగా వెంటాడుతున్న సమస్యలు దూరమవుతాయి. మీరు దాదాపు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: కుంభ రాశిలో శని తిరోగమనం, ఈ 4 రాశులవారికి కష్టకాలం!


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


శని తిరోగమనం మకరరాశివారికి మంచి చేస్తుంది. అనుకోని ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మంచి ఒప్పందాలు కుదురుతాయి. ప్రతి పనిలోనూ శని సహకారం ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు 


శని తిరోగమనం వల్ల కొన్ని రాశులవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా  కర్కాటకం, కుంభం, తుల, వృశ్చికం, మీన రాశులవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశులవారికి రానున్న నాలుగైదు నెలలపాటూ సవాలుగా ఉంటుంది. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.