Astrology:  ఓ వ్యక్తి జాతకం రాసినప్పుడు వారు జన్మించినప్పుడు ఏ దశ నడుస్తుందో మొదలుపెట్టి ఏ దశ ఎన్నేళ్లు ఉంటుంది ఆయా సమయంలో జాతకుడు ఎలాంటి ఫలితాలు పొందుతారో వివరిస్తూ రాస్తారు. అయితే ఓ దశ నడుస్తున్నప్పుడు అందరికీ ఒకేలాంటి ఫలితాలుండవు...ఆయా గ్రహాలు మ జాతకచక్రంలో బలంగా ఉన్నాయో, బలహీనంగా ఉన్నాయో దాన్నిబట్టి ఫలితాలుంటాయి. అవేంటో చూద్దాం..


రవి మహాదశ


జాతకచక్రంలో రవి (సూర్యుడు) బలవంతుడై ఉన్నప్పుడు సుఖం, ధన లాభం ,సన్మానం, కుటుంబంలో సంతోషం ఉంటాయి . సూర్యుడు 
బలహీనంగా ఉన్నపుడు శత్రువుల భాద, అగ్నిచోర భయం, గుండెజబ్బులు, ఉదార భాదలు, కుటుంబలో ఇబ్బందులు కలుగుతాయి. 


చంద్ర మహాదశ


చంద్రుడు బలవంతుడిగా ఉంటే శుభకార్యసిద్ధి, ద్రవ్యలాభము, వాహన ప్రాప్తి, నూతన ఇంటి ప్రవేశం కలుగుతుంది. బలహీనంగా ఉంటే రాజ వీరోధం, కుటుంబంలో ఎవరో ఒకరికి హాని, బాధ ఉంటాయి. 


Also Read: రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది


కుజమహాదశ


కుజుడు శుభస్థితిలో ఉంటే విజయం, ధనలాభం, ఉద్యోగ లాభం, ఆనందము, సకల కార్యసిద్ధి కలుగజేస్తాడు. అశుభ స్టితిలో ఉంటే మాత్రం బంధుమిత్రులతో విరోధాలు, కోపతాపాలు, వ్యసనాలు,అనారోగ్యం కలిగిస్తాడు.


రాహుదశ


జాతక చక్రంలో రాహువు బలంగా ఉంటే సర్వసౌఖ్యం, ఆదాయ ప్రోత్సాహం, వాహన లాభము, పుత్రలాభం, మహా సన్మానం, స్వస్థత ఉంటుంది. రాహువు దుష్ట స్థానంలో  ఉంటే ఇంట్లో కలహాలు, స్థాన చలనం, మనోవాకుల్యత, అనారోగ్యం తప్పదు


గురు దశ


గురుడు బలీయంగా ఉంటే బుద్ధి వికాసం, సంతాన లాభం, గృహ లాభం, కుటుంబ సుఖం, శత్రు జయము తథ్యం. గురుగ్రహం నీచస్థితిలో ఉంటే బంధనం, ఇంట్లో విపత్తులు, గౌరవ భంగం జరుగుతుంది.


శని దశ


శని బలంగా ఉంటే ఇంట్లో బలం పెరుగుతుంది, ధన లాభం, కుటుంబ సామీప్యత, వృత్తి వ్యాపారాల్లో లాభం, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. శని బలహీనంగా ఉంటే మాత్రం ఖర్చులు పెరుగుతాయి, అన్నింటా అసంతృప్తి, బంధుమిత్రులతో విరోధాలుంటాయి. 


Also Read:  వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుడిని ఉంచితే ఎన్ని ప్రయోజనాలో!


బుధ దశ


బుధుడు బలమైన స్థానంలో ఉంటే బంధు మిత్రులతో శుభ గోష్టి, ధన లాభం, శుభకార్యాలు, ఆనందం మీ సొంతం. బధుడు చెడు స్థానంలో ఉంటేమాత్రం  మనో వ్యాధి, కార్య విఘ్నములు, ధనం చేతిలో నిలవకపోవడం జరుగుతుంది. 


కేతు దశ


కేతువు శుభస్థానంలో ఉంటే వాహన సౌఖ్యం, పిల్లల వల్ల సంతోషం, నష్టపోయిన డబ్బులు తిరిగి పొందడం జరుగుతుంది. కేతువు నీచ స్థితిలో ఉంటే మాత్రం అనారోగ్యం, మనస్పర్ధలు, ధన నష్టం, అసౌఖ్యం తప్పదు


శుక్ర దశ


జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు శుక్రమహాదశ నడిస్తే నూతన గృహం, వాహనం, వస్తు లాభం ఉంటుంది. కార్యశిద్ధి, ధనం పెరుగుతుంది, సుఖంగా జీవిస్తారు. శుక్రుడు శుభ స్థానంలో లేకపోతే మాత్రం భార్య-భర్త మధ్య విభేదాలు అసుఖం తప్పదు. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.