తెలంగాణలో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీని వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ఖరారుచేసింది. రాతపరీక్షను ఆగస్టు 2న సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్లు  పేర్కొంది. ఈ మేరకు జూన్ 12న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2న మొత్తం మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఈ పరీక్ష జరగనుంది. 


స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి బోర్డు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో మూడు షిఫ్టులలో పరీక్ష నిర్వహించాని అధికారులు నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి 10.20 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1.50 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5.20 వరకు మూడు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగనుంది. 


రాతపరీక్ష ఇలా.. 
మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 80 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 20 మార్కులు వెయిటేజీ కింద ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిజేస్తున్న వారికి వారు పనిచేసిన సంవత్సరాల ఆధారంగా వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం కేవలం అంగ్లంలోనే ఉంటుందని మెడికల్‌ బోర్డు స్పష్టం చేసింది. జూలై 23 నుంచి అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 5,204 పోస్టులు


1) స్టాఫ్ నర్స్: 3,823 పోస్టులు
విభాగం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.


2) స్టాఫ్ నర్స్: 757 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్యవిధాన పరిషత్. 


3) స్టాఫ్ నర్స్: 81 పోస్టులు
విభాగం: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్.


4) స్టాఫ్ నర్స్: 08 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్.


5) స్టాఫ్ నర్స్: 127 పోస్టులు
విభాగం: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


6) స్టాఫ్ నర్స్: 197 పోస్టులు
విభాగం: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


7) స్టాఫ్ నర్స్: 74 పోస్టులు
విభాగం: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం).


8) స్టాఫ్ నర్స్: 124 పోస్టులు
విభాగం: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


9) స్టాఫ్ నర్స్: 13 పోస్టులు
విభాగం: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


నోటిఫికేషన్, పోస్టుల ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..




Also Read:


జులై రెండోవారంలో 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్ ఫలితాలు! మెయిన్స్‌ పరీక్షలు అప్పుడేనా?
తెలంగాణలో 501 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఒకపక్క పేపర్ లీక్ విచారణ సాగుతున్న సమయంలోనే.. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు  ఊపిరిపీల్చుకున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPSC గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్ పై స్టేకు హైకోర్టు నిరాకరణ- ప్రభుత్వానికి, టీఎస్ పీఎస్సీకి నోటీసులు
తెలంగాణలో ఇటీవల టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల తరువాత ప్రస్తుతం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలని కొందరు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు ఆ ఎగ్జామ్స్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జీవో 55, 136 కొట్టివేయాలని 101 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్న టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించి, తరువాత తొలగించారని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, టీఎస్ పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. జూలై 13కి తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...