7-Day Anti-Inflammatory Diet for Weight Loss : బరువు తగ్గాలనుకునే వారు వ్యాయమంతో పాటు డైట్ విషయంలో కొన్ని మార్పులు చేయాలి. అలాంటి మార్పులు చేయాలనుకుంటే యాంటీ ఇన్​ఫ్లమేటరీ డైట్​ని ఫాలో అయితే మంచిదని చెప్తున్నారు ఫిట్​నెస్ ట్రైనర్ అంచల్. బరువును వేగంగా తగ్గడంలో ఇది హెల్ప్ చేస్తుందని చెప్పడమే కాకుండా.. తన ఇన్​స్టాగ్రామ్​లో యాంటీ ఇన్​ఫ్లమేటరీ డైట్​కి సంబంధించిన డైట్​ ఛార్ట్​ని కూడా షేర్ చేశారు. ఏడు రోజులకు సరిపడా ఈ డైట్​ను మీరు వెయిట్ లాస్ జర్నీకోసం ఫాలో అవ్వచ్చని తెలిపారు. ఇంతకీ ఆ డైట్​ చార్ట్​ ఎలా ఉందంటే.. 


మొదటి రోజు 



  • పరగడుపున రాత్రి నానబెట్టిన 5 బాదంలు, జీలకర్ర, వామ్ము కలిపిన వాటర్ తీసుకోవాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా శనగపిండితో చేసిన అట్టు.. 20 గ్రాముల పుదీనా చట్నీతో కలిపి తినాలి.

  • స్నాక్​గా ఏదైనా పండు, ఒక టేబుల్ స్పూన్ సీడ్స్ తీసుకోవచ్చు.

  • లంచ్​కోసం క్వినోవాను తీసుకోవాలి. దానిలో శనగలు వేసుకోవచ్చు.  కూరగాయలను ఉడికించి తీసుకోవాలి.

  • సాయంత్రం స్నాక్స్ సమయంలో ఒక కప్పు పుదీనా టీని, 30 గ్రాముల మఖానాను తినవచ్చు.

  • డిన్నర్​గా 150 గ్రాముల దాల్ కిచిడిని తినవచ్చు.

  • రాత్రి పడుకునే ముందు అల్లం, సోంపు నీటిలో వేసి మరిగించి.. తాగాలి. 


రెండో రోజు.. 



  • పరగడుపున అల్లం, పసుపు, మిరియాలు కలిపిన డిటాక్స్ షాట్ తీసుకోవాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా ఓట్​మీల్​ను ​నట్​ మిల్క్​, ఫ్రూట్స్​తో కలిపి తీసుకోవచ్చు.

  • స్నాక్​గా ఓ గ్లాస్​ బీట్​రూట్ జ్యూస్ తీసుకోవాలి.

  • లంచ్​కోసం రెండు ఇడ్లీలు, ఓ కప్పు సాంబార్ తీసుకోవాలి. 20 గ్రాముల కొబ్బరి చట్నీని తీసుకోవచ్చు.

  • స్నాక్స్​గా స్ప్రౌట్స్ తినొచ్చు. వీటిని చాట్​గా లేదంటే సలాడ్​గా తీసుకోవచ్చు.

  • డిన్నర్​లో పరాటను బీట్​రూట్, టోఫుతో తీసుకోవచ్చు.

  • రాత్రి పడుకునే ముందు ఒక కప్పు చమేలీ టీ తాగొచ్చు. 


మూడో రోజు 



  • ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. నానబెట్టిన 5 బాదంలు, రెండు వాల్​నట్స్​ తీసుకోవాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా పెసరపప్పు దోశను 20 గ్రాముల పుదీనా చట్నీతో తీసుకోవాలి.

  • స్నాక్​గా వందగ్రాముల బొప్పాయిని 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజల్ని తీసుకోవచ్చు.

  • భోజనంగా 30 గ్రాముల రాజ్మా, 100 గ్రాముల రైస్, కూరగాయలను తీసుకోవాలి.

  • స్నాక్​గా 1 స్పూన్ సీడ్స్, డేట్స్ లడ్డూ తీసుకోవచ్చు.

  • డిన్నర్​ సమయంలో మిల్లెట్స్ కిచిడి తినాలి.

  • రాత్రి పడుకునే ముందు తులసి, జీలకర్ర, వామ్మును నీటిలో వేసి మరిగించి తీసుకోవాలి. 


నాల్గవ రోజు 



  • దాల్చినచెక్కను నీటిలో వేసుకుని.. మరిగించి.. గోరువెచ్చగా పరగడుపునే తీసుకోవాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా నానబెట్టిన 5 బాదంలు, జొన్న ఉతప్పం. దానిలో వెజిటెబుల్స్​ కూడా కలిపి వేసుకోవాలి.

  • స్నాక్​గా  ఓ గ్లాసు వెజిటెబుల్ జ్యూస్ తీసుకోవాలి.

  • లంచ్​లో పప్పు పాలకూర, ఒక మిల్లెట్స్ రోటి, 100 గ్రాముల కీరదోస రైతా తీసుకోవాలి.

  • స్నాక్స్​గా ఓ స్పూన్ సీడ్స్, డేట్​ లడ్డూ తీసుకోవచ్చు.

  • డిన్నర్​గా కూరగాయలు, టోఫు కలిపిన సలాడ్ తీసుకోవాలి.

  • రాత్రి పడుకునే ముందు ఒక కప్పు చమేలీ టీ తాగాలి. 


ఐదో రోజు 



  • పసుపు, అల్లం, మిరియాల పొడితో డిటాక్స్ షాట్ తీసుకోవాలి. నానబెట్టిన 5 బాదం తినాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా బ్రెడ్ శాండ్​విచ్​ని శనగలతో కలిపి తీసుకోవాలి.

  • స్నాక్​గా 100 గ్రాముల బొప్పాయి, 1 టేబుల్ స్పూన్ సీడ్స్ తినాలి.

  • మధ్యాహ్న భోజంలో జొన్న రొట్టె, గుమ్మడి కర్రీ, పప్పు కూర, 100 గ్రాముల పెరుగు కూడా తీసుకోవాలి.

  • స్నాక్స్​గా 30 గ్రాముల వెజిటెబుల్స్, టోఫు తీసుకోవాలి.

  • డిన్నర్​లో టమోటో, తులసి సూప్​ని తీసుకోవాలి. 70 గ్రాముల పనీర్ బుర్జీ తీసుకోవాలి. ఇది లో ఫ్యాట్ అయితే మంచిది.

  • పడుకునే ముందు సోంపు గింజల్ని నీటిలో మరిగించి గోరువెచ్చగా తీసుకోవాలి. 


ఆరో రోజు 



  • ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగాలి. 5 ఆల్మండ్స్ తినాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా 2 మిల్లెట్ ఇడ్లీ, ఓ కప్పు సాంబార్, 20 గ్రాముల చట్నీ తినాలి.

  • స్నాక్​గా ఓ గ్లాస్​ బీట్​రూట్ జ్యూస్ తాగాలి.

  • భోజనంలో పనీర్ బుర్జి, 1 మిల్లెట్ రోటి, యోగర్ట్ తినాలి.

  • స్నాక్స్​గా రెండు నారింజలు తీసుకోవచ్చు.

  • డిన్నర్​గా ఓ రోటి, పప్పు కర్రీ, 100 గ్రాముల కీరదోస రైతాను తినాలి.

  • పడుకునే ముందు జీలకర్ర, వామ్ము నీటిని తాగితే మంచిది. 


ఏడవ రోజు 



  • ఉదయాన్నే దాల్చినచెక్క, నల్లని ఎండుద్రాక్ష నీటిని తీసుకోవాలి. 5 బాదం, 2 వాల్​నట్స్ నానబెట్టి తినాలి.

  • బ్రేక్​ఫాస్ట్​గా కూరగాయలతో చేసిన ఉప్మాను పది గ్రాముల పల్లీలను తినొచ్చు.

  • స్నాక్​గా 1 గ్లాస్​ కొబ్బరి నీళ్లు, చియాసీడ్స్ వాటర్ తీసుకోవచ్చు.

  • భోజోనంలో శనగల కూర, 100 గ్రాములు స్టీమ్ చేసిన రైస్, 1 కప్పు కూరగాయుల తినాలి.

  • స్నాక్స్​గా 20 గ్రాముల మఖానా, ఓ కప్పు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

  • డిన్నర్​గా 200 గ్రాముల కూరగాయలు, పప్పుతో కూడిన మిల్లెట్ కిచిడి తీసుకోవచ్చు.

  • పడుకునే ముందు తులసి, అల్లం నీటిని తాగాలి. 


ఈ డైట్​లో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ తినకూడదని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన, ఫ్రై చేసిన ఫుడ్స్ తినకూడదు. వైట్ బ్రెడ్, షుగర్ వంటి రిఫైన్డ్ కార్బ్స్ జోలికి వెళ్లకూడదు. షుగర్ డ్రింక్స్, సోడాలు తాగకూడదు. ఆల్కహాల్ మానేస్తే మంచిది. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మీట్ తినకూడదు. 



Also Read : ఇంటి భోజనంతో బరువును ఇలా ఈజీగా తగ్గొచ్చు.. బెల్లీ ఫ్యాట్​ని వేగంగా తగ్గించే ఫుడ్స్ ఇవే​