Trinayani Serial Today January 22nd: 'త్రినయని' సీరియల్: తిలోత్తమకు జలక్ ఇచ్చిన పాప.. దురంధర సూసైడ్.. ఆ దరిద్రం తన కడుపులో వద్దంట!
Trinayani Today Episode తిలోత్తమ చనిపోయి తన కడుపులో పుడుతుందని దురంధర భావించి కడుపులో బిడ్డని చంపుకోవాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode తిలోత్తమ బ్యాగ్ చెక్ చేయాలని అందరూ అనుకుంటారు. నయని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గాయత్రీ పాపని చూస్తే నయని శివంగిలా తమ మీద విరుచుకుపడుతుందని తిలోత్తమ భయపడుతుంది. తీరా చూస్తే బ్యాగ్‌లో బట్టలు మాత్రమే ఉంటాయి. పాప ఉండదు. తిలోత్తమ, వల్లభలు షాక్ అవుతారు. పాప లేదు ఏంటని అనుకుంటారు.
ఫ్లాష్ బ్యాక్‌లో గాయత్రీ పాపని తిలోత్తమ బ్యాగ్‌లో పెట్టి బట్టలు తీసుకురావడానికి వెళ్లినప్పుడు పాప లేచి దాక్కుంటుంది. అది తెలియని వల్లభ, తిలోత్తమలు బ్యాగ్‌లో బట్టలు నింపుతారు. ఇక కిందకి గాయత్రీ పాప వస్తుంది.
వల్లభ: అలా ఎలా వచ్చింది బయటకి.
విక్రాంత్: బయటకి అంటే.
తిలోత్తమ: మేం బయటకు వెళ్తున్నాం అని ఎలా తెలిసింది గదిలో ఉండాల్సిన పాప బయటకు వచ్చిందని వాడి ఉద్దేశం.
దురంధర: నా మాట విని మీరు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడుంటేనే నయని పాపని పట్టుకోగలదు.
విక్రాంత్: మీకు ఏదైనా అపద వచ్చినా వదిన మీకు చెప్పగలదు.
బామ్మ: వెళ్లండి అమ్మా మీ గదుల్లోకి వెళ్లండి తప్పించుకోవాలని ప్రయత్నించే కొద్దీ కొత్త కష్టాలు వస్తాయి అనుభవంతో చెప్తున్నా.
తిలోత్తమ: పదరా.
విక్రాంత్: సుమన నా మాట వినిపించుకోకపోతే నువ్వు చాలా నష్టపోతావ్. మా అమ్మ అన్నయ్యలకు దూరంగా ఉండు. నువ్వు వాళ్ల ట్రాప్‌లో పడ్డావ్. ఇప్పటి వరకు వాళ్లు నీకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే నీకు రంగులు చూపిస్తున్నారు. ఆశపెడుతున్నారు.
సుమన: అత్తయ్య అలా చేయరు. పోయే ముందు నాకు ఆస్తి ఇస్తారు. మిమల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు.
విక్రాంత్: మా అమ్మ చావదు. మా అమ్మ ప్లాన్ మార్చుతుంది. నా అంచనా ప్రకారం ఇందాక లగేజ్ బ్యాగ్‌లో బట్టలకు బదులు పాపని తీసుకెళ్లాలి అనుకొని ఉంటారు. మా అమ్మకి ఎలాంటి గండం ఎదురు అవ్వకూడదు అంటే ఎదురుగా పాప ఉండకూడదు పాపని మాయం చేయాలి అనుకొని ఉంటారు.
సుమన: అలా అయితే ట్రాలీలో పాప ఉండాలి కదా.
విక్రాంత్: గాయత్రీ పాప అందరిలాంటి పాప కాదు తను మా పెద్దమ్మ పెద్దమ్మకి ఎలా తప్పించుకోవాలో ఈ జన్మలో మా అమ్మని ఎలా తప్పించాలో చాలా బాగా తనకు తెలుసు. నువ్వు వాళ్లకి దగ్గరగా ఉంటే బోనస్ కింద నువ్వు చావొచ్చు జాగ్రత్త
సుమన: అంత ఆఫర్ నాకు ఎందుకు లెండీ.
దురంధరకు ట్యాబ్లెట్స్ వేసుకోమని పావనా మందులు తీసుకొచ్చి ఇస్తాడు. దురంధర ఏం మందులు వద్దని మీ కలలు నాశనం చేస్తున్నాను అని చెప్పి కడుపులో బిడ్డతో పాటు తాను చావాలని ఏవో ట్యాబ్లెట్స్ వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో నయని వచ్చి అడ్డుకుంటుంది. దురంధర చేతిని పట్టుకొని ట్యాబ్లెట్స్ కింద పడేయమని చెప్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. ఎందుకు చావాలి అనుకుంటున్నావ్ అని అందరూ దురంధరని అడుగుతారు. దురంధర ఏడుస్తుంది.
తిలోత్తమ: అసలు కారణం చెప్పు దురంధర
దురంధర: నీ వల్లే వదిన.
పావనా: అక్కాయ్ నేను అయినా నా భార్య అయినా నీ జోలికి వచ్చామా నీకేమైనా అన్యాయం చేశామా.
తిలోత్తమ: నోటి కొచ్చినట్లు ఎవరైనా వాగితే చెంపలు వాయిస్తా.
దురంధర: వదిన చనిపోతే మళ్లీ నా కడుపులో పుడుతుంది అన్నారు కదా అందుకే పోయి పోయి ఇలాంటిది నాకు పుట్టడం ఏంటి అని ఇలా చేయాలి అనుకున్నా. వదిన మాత్రం చచ్చినా నా కడుపున పుట్టకూడదు.
ఏం జరగకుండానే ఏవేవో ఊహించుకొని ఇలాంటి ఆలోచనలు ఎందుకని అందరూ దురంధరని తిడతారు. సుమన ఇదంతా పాప వల్లే అని అంటుంది. పాపే ప్రాణాలు తీయాలి అనుకోవాలి అనుకోకపోతే ఇదంతా ఉండదు అనేసి సుమన వెళ్లిపోతుంది. తిలోత్తమ నయనిని కోపంగా చూసి వెళ్లిపోతుంది. ఇక తర్వాత తిలోత్తమ, వల్లభలు ఓ చోట కూర్చొని ఆలోచిస్తుంటారు. నిజంగానే పోతానా అని తిలోత్తమ అంటుంది. ఇంతలో సుమన అక్కడికి వస్తుంది. నయని లాయర్లతో మాట్లాడుతుందని తెలియకుండా చిన్న పిల్లలు ఎవరినైనా చంపేస్తే అది నేరం అవుతుందా శిక్ష పడుతుందా అని మాట్లాడుతుందని సుమన చెప్తుంది. దాంతో తిలోత్తమ నన్ను చంపేసి ప్రమాదంలా సృష్టించాలని అనుకుంటున్నారని అంటుంది. నయనిని ఇరికిస్తానని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!