Anjali Merchant: ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు ఈ సెలబ్రేషన్స్ అన్నీ చివరిదశకు చేరుకుంటున్నాయి. అంబానీ ఇంట పెళ్లి వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలు హాజరవుతున్నారు. తాజా పెళ్లి కూతురు రాధిక మర్చంట్ సోదరి అంజలీ మార్చంట్ గురించి చర్చ నడుస్తోంది. ఆమె ధరించిన కాస్ట్యూమ్ హల్దీ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. దీంతో అసలు దాని ధర ఎంత, డిజైనర్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు.
డిఫరెంట్ కలర్ కాంబినేషన్..
ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల హల్దీ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఈ హల్దీకి తగినట్టుగా డ్రెస్సులు వేసుకొని అందరినీ అలరించారు సెలబ్రిటీలు. అందులో రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ ధరించిన లెహెంగా.. ఫంక్షన్‌లో చాలా హైలెట్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ లెహెంగాకు చాలామంది అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. తను పింక్ లెహెంగాపై బ్లూ కలర్ బ్లౌజ్, యెల్లో కలర్ ఓణీ వేసుకొని చాలా అందంగా కనిపించింది. ఇదొక పింక్ బనారసీ లెహెంగా. పూర్తిగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌లో ఈ లెహెంగా ఉంది.
ధర ఎంతంటే.?
ఆ లెహెంగాపై రూబీ, ఎమెరాల్డ్, పెర్ల్స్‌తో కలిసిన ఒక చిన్న నెక్లెస్‌ను, దానికి తగిన కమ్మలను పెట్టుకుంది అంజలి మర్చంట్. జుట్టుకు పెద్దగా స్టైలింగ్ చేయించకుండా చిన్నగా క్లిప్ పెట్టి వదిలేసింది. దీని వల్ల తన లుక్ అంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉందని చాలామంది అమ్మాయిలు ప్రశంసిస్తున్నారు. ఈ లెహెంగా.. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ అయిన జయంతి రెడ్డి డిజైన్ చేసినట్లు సమాచారం. దీని ధర రూ.3.5 లక్షలు అని సమాచారం. జయంతి రెడ్డి స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ద్వారా అంజలి మర్చంట్ లెహెంగా ధర బయటపడింది. ఈ హల్దీ ఫంక్షన్‌లో ఎంతమంది పాల్గొన్న.. అంజలి మర్చంట్ లెహెంగా ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ సెలబ్రిటీలు..
అనన్య పాండే, సారా అలీ ఖాన్, ఓర్రీ, మానుషీ చిల్లర్ వంటి చాలామంది సెలబ్రిటీలు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ హల్దీ వేడుకలకు హాజరయ్యారు. రణవీర్ సింగ్ హల్దీ వేడుకలు ముగించుకొని వెళ్తుండగా ఫోటోగ్రాఫర్ల కంటపడ్డాడు. సల్మాన్ ఖాన కూడా యెల్లో కుర్తాలో మెరిశాడు. చాలావరకు సెలబ్రిటీలు అంతా యెల్లో డ్రెస్సులు ధరించి కనువిందు చేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు జులై 12న జరిగే పెళ్లి వేడుకతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, వాణిజ్య వేత్తలు ఇండియాకు వచ్చేశారు.
Also Read: అంబానీ సంగీత్‌లో షార్ట్, బనియన్‌తో జస్టిన్ బీబర్ - దీనికి అన్ని కోట్లు అవసరమా అంటూ నెటిజన్ల ట్రోల్స్