Anant Ambani - Radhika Merchant Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్‌మెంట్ నుంచి ప్రీ వెడ్డింగ్ వరకు.. ఇలా అంబానీ ఫ్యామిలీ ఏం చేసినా అందరినీ ఆశ్చర్యపరిచేలాగానే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. ఇక పెళ్లి ఏ రేంజ్‌లో జరగబోతుందో అని ఆలోచిస్తున్న నెటిజన్లకు.. తాజాగా బయటికొచ్చిన ఒక అప్డేట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అనంత్, రాధిక పెళ్లి కోసం మూడు ఫాల్కన్ 2000 జెట్స్‌ను బుక్ చేశారట ముఖేశ్ అంబానీ. అంతే కాకుండా మరొక 100 ప్రైవేట్ జెట్స్‌ను కూడా ఈ పెళ్లి కోసం ఉపయోగించనున్నట్టు సమాచారం.
విమానాలు సిద్ధం..
ముంబాయ్‌లో శుక్రవారం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఘనంగా జరగనుంది. ఇండియాలో ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఒక వెడ్డింగ్ జరగలేదని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వెడ్డింగ్ కోసం దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్‌లో ఒకటి అయిన ఫాల్కన్ 2000 జెట్లను బుక్ చేసుకుందట అంబానీ ఫ్యామిలీ. ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ కంపెనీ సీఈఓ అయిన రాజన్ మెహ్రా స్వయంగా వెల్లడించారు. అనంత్ అంబానీ పెళ్లికి దేశవ్యాప్తంగా గెస్టులు వస్తారు కాబట్టి ఈ మూడు ఫాల్కన్ 2000 జెట్స్.. దేశవ్యాప్తంగా చక్కర్లు కొడతాయని, గెస్టులను పెళ్లి వేడుకకు తీసుకొస్తాయని రాజన్ మోహ్రా తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు తప్పవు..
అంతే కాకుండా ఈ ఈవెంట్ కోసం దాదాపు 100కు పైగా ఇతర ప్రైవెట్ జెట్స్‌ను కూడా ఉపయోగించనున్నారట. ముంబాయ్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబాయ్‌లో మొదలయినప్పటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విపరీతంగా పెరిగిపోయాయి. శుక్రవారం పెళ్లి కాబట్టి ఆరోజు కూడా ముంబాయ్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు తప్పవని తెలుస్తోంది. జియో వరల్డ్ సెంటర్‌లోని బాండ్రా కుర్లా సెంటర్‌లో పెళ్లి జరగనుంది. జులై 12 నుంచి 15 వరకు మధ్యాహ్నం 1 నుంచి అర్థరాత్రి వరకు ఈ రోడ్డుపై ఈవెంట్‌కు సంబంధించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాలు రాకూడదని ప్రకటిచారు ముంబాయ్ ట్రాఫిక్ పోలీస్.
ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిశాయి..
పెళ్లి తర్వాత కూడా రెండు గ్రాండ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేసిందట అంబానీ ఫ్యామిలీ. ముంబాయ్‌లో అంటీలియాలో ఉన్న 27 ఫ్లోర్ల అంబానీ ఇంటి బయట ఇప్పటకే చాలా డెకరేషన్ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఆ రోడ్డు మొత్తం లైట్స్‌తో నింపేశారు. ఇప్పటికే ముంబాయ్‌లోని జియో కన్ఫెన్షన్ సెంటర్‌లో సంగీత్, హల్దీ లాంటి వేడుకలు ముగిశాయి. ఈ సంగీత్‌లో పాడడం కోసం అమెరికా నుంచి పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌ను రంగంలోకి దించారు ముఖేశ్ అంబానీ. ఈవెంట్‌లో పర్ఫార్మ్ చేయడం కోసం తనకు రూ.84 కోట్లు రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.
Also Read: చెల్లి పెళ్లిలో అక్క సందడి - రాధిక సోదరి అంజలీ మర్చంట్ లెహంగాపై చర్చ, ధర తెలిస్తే షాకవుతారేమో!