శరీరానికి నీరు చాలా అవసరం. ఆహారం లేకుండా అయినా కొన్ని రోజులు ఉండగలుగుతారేమో కానీ నీళ్ళు తాగకుండా బతకడం చాలా కష్టం. అందుకే శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరం సాధారణ రోజువారీ విధులు నిర్వహించాలంటే తగినంత నీరు కావాలి. వృద్ధుల్లో సాధారణంగా శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు త్వరగా డీహైడ్రేట్ అవుతారు.
ఎందుకు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతారు?
వయస్సు పెరిగే కొద్ది వారి శరీరంలో ద్రవ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఇదే కాదు దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మందులు వాడుతూ ఉంటే మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది కిడ్నీ పనితీరు కూడా మందగిస్తుంది. వీటి వల్ల వృద్ధుల్లో ఎక్కువగా డీహైడ్రేట్ సమస్య ఎదుర్కొంటారు. ఇవే కాదు అనేక అంశాలు కూడా దోహదపడతాయి. అవేంటంటే..
వాతావరణ మార్పులు: వాతావరణం వేడిగా లేదా తేమగా ఉంటే చెమట లేదా మూత్రం రూపంలో శరీరంలోని నీరు అధిక మొత్తంలో కోల్పోతారు. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులు కూడా తరచూ లేచి నీళ్ళు తాగడం కష్టంగా ఉండటం కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు.
అనారోగ్యం: విరోచనాలు ఎక్కువగా అయినప్పుడు అనారోగ్యం కారణంగా శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. వాటిని తిరిగి పొడటం చాలా కష్టం.
డీహైడ్రేట్ గురైనట్టు చెప్పే సంకేతాలు
పెద్దలు నీరు ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే అవి ఇతర అనారోగ్య సమస్యలకి దారి తీసే అవకాశం ఉంది. శరీరం డీహైడ్రేట్ కి గురైనట్టు చెప్పి కొన్ని సంకేతాలు..
☀ తక్కువగా మూత్ర విసర్జన లేదా మూత్రం ముదురు రంగులో రావడం
☀ అలసట
☀ చర్మం దురద పెట్టడం
☀ చర్మం పొడిబారిపోవడం
☀ మైకం, వికారం
☀ మతిమరుపు, కన్ఫ్యూజన్
☀ పెదవులు ఎండి పోవడం, పొడిగా అనిపించడం
వృద్ధుల్లో డీహైడ్రేషన్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దీర్ఘకాలికంగా ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ప్రభావం కాలేయం, గుండెమ్ మూత్రపిండాలు సహాయ ఇతర అవయవాల పనితీరు మీద చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విపరీతమైన డీహైడ్రేట్ వల్ల మరణం కూడా సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. మయో క్లినిక్ ప్రకారం ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
☀ శరీరానికి తగినంత నీరు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాయామం, ఎక్కువగా శారీరక శ్రమ చేసే వాళ్ళు నీటిని తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడతారు.
☀ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. రోజుకి కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తారు. నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి. ఎక్కువగా డీహైడ్రేట్ అవడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్, మూత్ర పిండాల వైఫల్యం కూడా సంభవించవచ్చు.
☀ మూర్చలు: పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ సెల్ నుంచి సెల్ కి విద్యుత్ సంకేతాలు తీసుకెళ్లడంలో సహాయపడతాయి. వాటిలో అసమతుల్యత ఏర్పడితే స్పృహ కోల్పోవడం, మూర్చలు రావడం జరగవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: వేడి నీటిలో, టీలో తేనె వేసుకుని తాగుతున్నారా? అయితే విషాన్ని తాగుతున్నట్టే
Also read: ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేసి చూడండి ఇట్టే ఆగిపోతాయి