గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 28 Today Episode 567)


వెళ్లిపోతున్న జగతితో ఎమోషనల్ గా మాట్లాడతాడు రిషి. ఇదంతా విన్న దేవయాని ఇదే అవకాశంగా తీసుకుని చెలరేగిపోతుంది.
దేవయాని: రిషి అంటే చిన్నపిల్లాడు తనకి నీ గురించి తెలీదు కానీ నేను నీ గురించి అంతా తెలుసుకునే మాట్లాడుతున్నాను. చిన్నప్పటినుంచి నువ్వు ఎప్పుడు రిషికి హాని చేద్దామని చూస్తున్నావు అని అంటుంది. 
మహేంద్ర: వదినగారు మీరు ఇందులో తలదూర్చోద్దు ఇది మా సమస్య 
 దేవయాని ఏడుస్తున్నట్లు నటిస్తూ..అంటే నేను మీకు కాని దాన్ని అయిపోయానా! నువ్వు,రిషి,జగతి  ముగ్గురు ఒక కుటుంబం అంటున్నావా అని అంటుంది.
రిషి: బాధపడొద్దు పెద్దమ్మా అని తీసుకెళ్లిపోతూ...డాడ్ మీరు ఆ మాట అనడం నాకు నచ్చలేదు 
మహేంద్ర: నా ఉద్దేశం అది కాదు అని అన్నా వాళ్ళు పట్టించుకోరు.
వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత జగతి ఏడుస్తుంది. ఆ తర్వాత రిషి కార్ తీసుకుని బయటకు వెళ్తాడు. 


Also Read: కార్తీకదీపం నాటకంతో సీరియల్ మరో మలుపు, కార్తీక్ భార్య మోనిత కాదని ఫిక్సైపోయిన శివ!


వసుధార గుడిలో దేవుడి ముందు..రిషి అన్న మాటలు తల్చుకుంటుంది. అమ్మను అమ్మా అని పిలవడంలో ఇన్ని అడ్డంకులేంటని బాధపడుతుంది..జగతిమేడంని రిషి సార్ అమ్మా అని పిలవాలి అనుకోవడం తప్పా అని వసు అంటుండగా తప్పే అని ఎంట్రీ ఇస్తాడు రిషి.
రిషి: తప్పు కాదు వసుధార పెద్ద తప్పు..వసుధార జరగని వాటిగురించి అనవసరంగా ఆరాటపడుతున్నావ్
వసు: జరగదు అనుకున్న ప్రతీదీ ఎప్పుడో అప్పుడు జరుగుతుంది..దాన్నే అధ్భుతం అంటారు
రిషి: అద్భుతాలగురించి వినాలి ఆశించకూడదు..ఎవర్ని ఏం కోరుకుంటున్నావ్..నీ వాగ్దానం నిలబెట్టుకోవడానికి బాగా కష్టపడుతున్నావ్ కదా 
వసు: కష్టమంటే ఇది కాదు సార్ ఒక తల్లి తన కొడుకుకి దూరమై,  కొడుకుతో అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరాటం ఉంది చూశారా..అదీ కష్టం అంటే..అదీ గుండెకోత అంటే..
రిషి: జగతి మేడం గురించి ప్రస్తావన మనమధ్య ఉండొద్దన్నాను కదా..జగతి మేడం కోసం ఎన్నో మెట్లు దిగాను, కాలేజీ ఫ్యాకల్టీ అింది,లెక్చరర్ గా ఉండనిచ్చాను, ఇంట్లోకి రానిచ్చాను ఇంత చేసినా సరే తల్లి అని పిలవట్లేదు అని అంటారు కానీ చేసినవి ఏవి గుర్తు ఉండదు. నాకు జగతి మేడం అంటే గౌరవం ఉన్నది కానీ నేను అమ్మా అని పిలవలేను
వసు: నేను ఎలాగైనా మీ చేత పిలిపిస్తాను సార్ 
రిషి: నేను ముందే చెప్పాను వసుధార, ఇంక జగతి మేడం విషయం మనిద్దరి మధ్య రాకూడదని అయినా సరే నువ్వు నా మాట వినకుండా పదేపదే ఆవిడ ప్రస్తావనే తెస్తున్నావు 
వసు: ప్రేమించడం అంటే ఇంకొకరి మాట వినడం కాదు సార్ వాళ్ళు తప్పు చేస్తే తప్పుని చెప్పడం కూడా. అన్ని విషయాలు లోనూ మంచిగా ఉండి ఈ ఒక్క విషయంలోనే చెడ్డగా ఉంటే మీకు ఆ మచ్చ ఉండడం నాకు నచ్చదు సర్. మా రిషి సార్ ఏ మచ్చ లేకుండా ఉండాలి 
రిషి: అయినా జగతి మేడం మీ ఇంటికి ఎందుకు వచ్చారు? నీతో ఏం మాట్లాడారు?. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఎందుకు అన్నారు? 
వసు: ఏమన్నారో తెలుసా సర్!మీ గురించే మాట్లాడారు. ఆవిడని అమ్మా అని పిలవకపోయినా పర్లేదు కానీ మనిద్దరిని బాగా ఉండమన్నారు. అది సార్ తల్లి ప్రేమ
రిషి: ఆవిడకి లేని బాధ నీకెందుకు? ఆవిడే పిలవద్దంటుంది కదా
వసు: ఒక తల్లి తన కొడుకు చేత అమ్మా అని పిలవకపోయినా పర్లేదు అని అన్న మాట రావాలంటే ఎన్నిసార్లు తన మనసు చంపుకుని ఉంటుంది సార్. అంత మంచి మనసు ఉన్న మేడం కోసమైనా నేను మీ చేత అమ్మా అని పిలిపిస్తాను 
రిషి: నేను పిలవను అని చెప్పి  గంటను కోపంతో గట్టిగా కొడతాడు దానికి రిషి చేతిలో నుంచి రక్తం వస్తుంది. సార్ రక్తం వస్తోంది 
వసు:  దెబ్బ తలిగితే రక్తమే వస్తుంది..మనసుకి దెబ్బ తగిలితే రాదు కదా 


Also Read: మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!
జగతి, మహేంద్రా,గౌతమ్ ఇంట్లో కూర్చుని ఉంటారు. రిషి ఎక్కడికి వెళ్లాడని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో గౌతమ్ వసుధార దగ్గరికి వెళ్లి ఉంటాడా అని అనుకుంటాడు. అప్పుడే రిషి-వసు ఇద్దరూ కార్లో వెళుతుంటారు. సార్ మనం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్దాం అని ఏడుస్తుంది. ఇంతలో గౌతమ్ కాల్ చేయడంతో కాల్ కట్ చేస్తాడు. వసుకి కాల్ చేస్తాడు గౌతమ్.. కాల్ కట్ చేయమంటాడు రిషి.. ఇక్కడ జరిగిందేదీ వాళ్లకు చెప్పొద్దంటాడు. నేను చెప్పను సార్ కానీ మీరు కట్టు కట్టించుకోవడానికి హాస్పటల్ కి పదండి అంటుంది.బస్ స్టాప్ దగ్గర దించేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అనేసి రిషి కాలేజీకి వెళ్లిపోతాడు. 


రిషి లోపలికి వెళ్లి  సోఫాలో పడుకుంటాడు. అప్పుడు వసు రిషి చేతికి మందు రాసి కట్టు కడుతుంది. 
రిషి: ఇక్కడికి ఎందుకు వచ్చావు 
వసు: మీ మీద ఉన్న ప్రేమ. మీరు అందర్నీ అంతలా ప్రేమిస్తారు కానీ ప్రేమించే గుణం ఉన్నప్పుడు క్షమించే గుణం కూడా ఉండాలి రిషి: నువ్వు నాకు క్షమించడం నేర్పిస్తున్నావా నువ్వు నా దగ్గర విషయాలన్నీ దాస్తావు ఏంటి అని అడిగితే లోకకళ్యాణం అంటావు అంతే కదా! నన్ను నా ఆలోచనను,మార్చే ప్రయత్నం చేయకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను వెళ్ళిపో 
వసు: మీరు ఇక్కడి నుంచి వెళ్తేనే నేను వెళ్తాను సార్ 
నా మనసేం బాలేదు నేను వెళ్ళనని రిషి అంటే నేనుకూడా వెళ్లనంటుంది వసుధార... నాతో నీకేంటని రిషి  అడిగితే మీరు నేను ఒకటే కదా సార్ అని రిప్లై ఇస్తుంది. 
ఎపిసోడ్ ముగిసింది...