Karthika Deepam September 28 Update: కార్తీకదీపం నాటకంతో సీరియల్ మరో మలుపు, కార్తీక్ భార్య మోనిత కాదని ఫిక్సైపోయిన శివ!

కార్తీకదీపం సెప్టెంబరు 28 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

Continues below advertisement

Karthika Deepam September 28th Episode 1469 (కార్తీకదీపం సెప్టెంబరు 28 ఎపిసోడ్)

Continues below advertisement

కార్తీకదీపం నాటకం ద్వారా దీప..కార్తీక్ కి గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంది. నీ కడుపులో పెరిగే బిడ్డనకి తండ్రిని నేను కాదని కార్తీక్ అనడంతో..ఇంట్లోంచి వెళ్లిపోతుంది దీప..కొన్నేళ్లతర్వాత అని మళ్లీ మనకు కవలలు పుట్టారు డాక్టర్ బాబు అనిదీప ప్రాధేయపడడం..మోనిత తప్పుదారి పట్టించడం అవన్నీ నాటకంలో వేస్తుంది. కార్తీక్ కి తలనొప్పి మొదలవుతుంది.  నీకు ఏమైనా సహాయం కావాలంటే చేస్తాననడంతో..దీప కాళ్లుపట్టుకుని ఏడుస్తుంది. ఎవరో చేసిన మోసానికి మనం బలైపోయాం, మీరు చెడ్డవారు కాదు నేను చెడ్డదాన్ని కాదు మనకాపురంలో చిచ్చుపెట్టిన వారెవరో తెలుసుకోండి అని డైలాగ్స్ స్టేజ్ పై పడుతుంటాయి..అటు కార్తీక్ కి గతం గుర్తొస్తుంటుంది.

ఆ తర్వాత హిమ వచ్చి నువ్వేనా నా అమ్మవి అని హత్తుకుంటుంది..ఇదంతా చూస్తున్న కార్తీక్.. వంటలక్కతో శౌర్య ఎవరు, ఆ తర్వాత ఏమవుతుందని ఆసక్తిగా ఉంటాడు. అప్పుడు శౌర్య చదువుకి అయ్యే ఖర్చులన్నీ తానే పెడతానని కార్తీక్ అంటాడు. ఆ పక్కనే ఉన్న సౌందర్య శౌర్యని చూసి ఇది మన మనవరాలే, అచ్చు నాలాగే ఉన్నది నా మొదటి అక్షరం, నా చివరి అక్షరం కలిపి శౌర్య అనే పేరు పెట్టింది. మన మనవరాల్లు ఇద్దరు డాన్స్ బాగా చేశారు కదా అని అంటుంది. అప్పుడు మీ అమ్మని పిలవమని స్టేజ్ మీద కార్తీక్ అనడంతో...నాటకం చూస్తున్న కార్తీక్ దీప వెళ్లు అంటాడు. శౌర్య కార్తీక్ తో.. నువ్వేకదా మా నాన్నవి నాకు తెలుసు అని ఏడుస్తుంది. ఇదే నాటకంలో మోనిత ఎంట్రీ ఉంటుంది...నేను నెలతప్పాను కారణం నువ్వే అని అంటుంది. నేను నీ బిడ్డకి తండ్రిని కాదు అని అరుస్తాడు. 

Also Read: దీపని గుర్తుపట్టేసిన కార్తీక్, శౌర్యని తప్పుదారి పట్టించిన మోనిత

నాటకాన్ని చూస్తున్న కార్తీక్...మోనిత ఎక్కడ అని అడిగితే వస్తుండి లెండి అని చెప్పి వాళ్లన్నయ్య కూర్చోబెడతాడు. ఆ తర్వాత సీన్లో మోనిత,కార్తీక్ లు తన బిడ్డతో పూజ చేస్తుంటారు. తర్వాత కార్తీక్,దీప వెళ్లి మేము పెళ్లయిన మొదట్లో ఇక్కడికే వచ్చాము అని అంటారు. వాళ్లు ఆరోజు అక్కడ పాడిన పాటలను కూడా ఇక్కడ దీప పాడుతుంది. అప్పటికే కార్తీక్ కి చాలా అస్పష్టమైన గతం గుర్తొస్తూ ఉంటుంది. ఇంతలో హిమ కార్తీక్ దగ్గరికి వెళ్లి నాకు కార్ డ్రైవింగ్ నేర్పించు డాడీ అని అడుగుతుంది. అప్పుడు దీప స్టేజ్ మీద నుంచి కిందకి వస్తున్నప్పుడు కార్తీక్ దీపతో,వద్దు దీప వద్దు అని అరుస్తూ తలనొప్పి తో కళ్ళు తిరిగి పడిపోతాడు. 

శౌర్యని దింపేసి ఇంటికి చేరుకున్న మోనిత..మొన్న  అంకుల్, ఆంటీ వస్తారేమో అని భయపడ్డాను ఇప్పుడు శౌర్య కూడా ఇక్కడే ఉంది.ఏదో చిన్న అవసరం అని ఇంటికి వచ్చి కార్తీక్ ని చూసే అవకాశం ఉంది,వెంటనే కార్తీక్ ని ఇక్కడి నుంచి తీసుకు వెళ్లిపోవాలి అని అనుకునీ కార్తీక్ అని పిలిచినా కార్తీక్ రాకపోయేసరికి కార్తీక్ ఎక్కడ అని శివని అడుగుతుంది. వంటలక్క తో వెళ్ళారు మేడం అని శివ  చెప్పడంతో లాగిపెట్టి కొడుతుంది. మరి నువ్వు ఎందుకిలా ఉన్నావు వేలకువేలు జీతం ఇచ్చి నిన్ను పెట్టుకోవడం ఎందుకు? ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని మోనిత టెన్షన్ పడుతుండగా..పక్కనే ఉన్న కమ్యూనిటీహాల్ కి వెళ్లిందని చెబుతాడు. కంగారుగా మోనిత అక్కడకు వెళుతుంది.

Also Read: మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!
అప్పుడు శివ...ప్రతి భార్య తన మొగుడిని ఇలాగే కాపలా పెడుతుందా! ఖచ్చితంగా ఈవిడ సార్ భార్య కాదు అని అనుకుంటాడు. అప్పుడు మోనిత కమ్యూనిటీ హాల్ కి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. 
ఎపిసోడ్ ముగిసింది....

Continues below advertisement
Sponsored Links by Taboola