సామ్రాట్ గారి చెల్లెలు ఏమైందని తులసి అడుగుతుంది. సామ్రాట్ అమ్మా, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి చెల్లికి అన్నీ తానై గుండెల మీద పెట్టుకుని పెంచారు. సునంద పెరిగి పెద్దది అయ్యింది. ప్రేమ విషయంలో మాత్రం సునంద అన్న కళ్ళు గప్పి తన కంపెనీలో పని చేసే మేనేజర్ నిరంజన్ ని ప్రేమించింది. చెల్లి ప్రేమ విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. నిరంజన్ క్యారెక్టర్ మంచిది కాదని నచ్చజెప్పడానికి ట్రై చేశాడు కానీ సునంద వినలేదు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. తప్పనిసరై సామ్రాట్ వాళ్ళ పెళ్లి చేశాడు. నిరంజన్ కి క్యాష్ ఇవ్వడంతో పాటు ఆస్తిలో వాటా కూడా ఇచ్చాడు. సునందకి హనీ పుట్టింది. ఆస్తి మొత్తం కాజేసి సునందని బాగా కొట్టేవాడు. అన్నయ్య మాట విననందుకు దేవుడు తగిన శాస్తి చేశాడని సునంద బాధపడింది. హనీని సామ్రాట్ ఇంటి గుమ్మం ముందు వదిలి ఆత్మహత్య చేసుకుంది. నిరంజన్ ని సామ్రాట్ జైలుకి పంపాడు.


నిరంజన్ చేసిన మోసం వల్ల మనుషుల మీద నమ్మకం పోగొట్టుకున్నాడు. రాతి బండలా మారిపోయాడు. తన చెల్లిని తలుచుకుంటూ కన్నీరు పెట్టని రోజు లేదు. అప్పటి నుంచి పాపకి తానే తండ్రి అయ్యాడు. నీ మాట కాదని నిజం బయట పెట్టాను నన్ను క్షమించురా అని పెద్దాయన చెప్తాడు. మీ గొప్పతనం తెలుసుకోలేక మావాడు మిమల్ని ఇబ్బంది పెట్టాడు క్షమించండి అని తులసి అడుగుతుంది. నాకు అభి మీద కోపం ఏమి లేదని సామ్రాట్ అంటాడు. పాప కోసం మీరు ఒంటరి జీవితం గడిపే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా పరంధామయ్య అడుగుతాడు. రిస్క్ తీసుకోదలుచుకోలేదు హనీ కళ్లలో నీళ్ళు కనిపిస్తే నా చెల్లి బాధపడినట్టే. ఒక్క రోజు కూడా నేను హనీని వదిలి ఉండలేను. అందుకే హనీని మీ ఇంటికి పంపించకుండా మిమ్మల్నే ఈ ఇంటికి రప్పించాను అని సామ్రాట్ చెప్తాడు.


Also Read: నిజం తెలుసుకున్న రుక్మిణి- ఊహించని మాట అడిగిన సత్య, చిన్మయి మీద ఫోకస్ పెట్టిన మాధవ్


హనీకి మాత్రం ఈ విషయం ఎవరు చెప్పొద్దని సామ్రాట్ అడుగుతాడు. హనీకి నిజం చెప్పి తను బాధపడేలా చేయము అని అందరూ మాట ఇస్తారు. సామ్రాట్ కి పెళ్లి కాలేదు కాబట్టి తులసికి దగ్గర కావాలని ట్రై చేస్తున్నాడని జాగ్రత్తగా మీ అమ్మ చెవిలో వేయాలి అని లాస్య మరో ప్లాన్ వేస్తుంది. మా అమ్మ అల్ ఇండియా తులసి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైవ్ లో ఎన్ని సాక్ష్యాలు చూపించినా నమ్మదు అని నందు అంటాడు. నమ్మేలా చెయ్యాలి అని ఆవిడని మన వైపుకి తిప్పుకుందామని లాస్య పుల్ల వేస్తుంది. టీవీలో సామ్రాట్ గురించి టీవీలో వస్తుంది. సామ్రాట్ గారు మౌనంగా ఎందుకు ఉన్నారు? సామ్రాట్ గారి మౌనం వెనుక అర్థం ఏంటి? అని టీవీలో రావడం అటు సామ్రాట్, ఇటు తులసి ఫ్యామిలీ మొత్తం చూస్తుంది.


ఏమి లేనిదానికి ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు అని సామ్రాట్ అంటాడు. తులసి మాత్రం అది చూసి మౌనంగా ఉంటే అభి ఫైర్ అవుతాడు. వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో అని మీడియాలో వచ్చింది కనిపించలేదా అని అభి అంటాడు. నీ జీవితానికి మచ్చ పడుతుంది, అది పట్టించుకోవా అని అడుగుతాడు. మీ అమ్మ మీద నమ్మకం లేదా అనుమానిస్తున్నావా అని పరంధామయ్య అంటాడు. లాస్య ఆంటీ చేతిలో కీలుబొమ్మగా మారకు ఆంటీ పరువు తియ్యకు అని శ్రుతి చెప్తుంది. అందరూ అభిని తలా ఒక మాట అంటారు. అది విని అంతా అయిపోయింద మీ ఉక్రోషం తిరకపోతే నన్ను చంపేయ్ అని కత్తి తెచ్చి ప్రేమ్ కి ఇస్తాడు అభి. ‘నువ్వంటే నాకు ఇష్టం ఉంది మామ్ కానీ పైకి చెప్పుకోలేను.. మామ్ పరువు తీయ్యలి అనే ఉద్దేశం నాకు లేదు. నాకు ప్రాణభిక్ష పెట్టింది అలాంటి మామ్ కి నేను ఎందుకు హాని చేస్తాను నన్ను ఎందుకు అందరూ శత్రువులా చూస్తున్నారు. వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోడం లేదు బాధగా ఉంది మామ్ తట్టుకోలేకపోతున్నా’ అని అభి ఎమోషనల్ గా మాట్లాడతాడు.   


Also Read: ఊహించని ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన మాళవిక- వసంత్, చిత్రని కలిపిన యష్, అవధుల్లేని ఆనందంలో తేలిపోతున్న వేద