ముందు వసంత్, నిధిల నిశ్చితార్థం జరిగేలా వేద ప్లాన్ వేస్తుంది. ఇదే విషయమపై సులోచన, మాలిని మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుంది. ముహూర్తాలు మార్చినంత మాత్రాన వసంత్, నిధిల ఎంగేజ్మెంట్ జరిగీ తీరుతుందని మాలిని అంటుంది. వసంత్, నిధి ఎంగేజ్మెంట్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది చూస్తూ చిత్ర చాలా బాధపడుతుంది. ఇద్దరు దండలు కూడా మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకునే టైంలో వసంత్ చిత్రతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటే రింగ్ తొడగటానికి ఏంటి ఆలోచిస్తున్నావ్ ముహూర్తం దాటిపోతుందని దామోదర్ అంటాడు. రింగ్ పెట్టమని యష్ కూడా అనేసరికి వసంత్ నిధి వెలికి ఉంగరం తొడగకుండా పైకి లేస్తాడు.


నా వల్ల కాదు ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదని వసంత్ అంటాడు. ఏమైంది, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇష్టం లేదని ఎలా చెప్తావ్.. ఇన్ని రోజులు నాతో సరదాగా సంతోషంగా ఉన్నావ్ కదా అని నిధి అడుగుతుంది. అదంతా నిజం కాదు నటన. ధైర్యం లేక జీవితంలో కావలసింది దక్కించుకోలేక నీ ముందు నటించాను. నిన్ను ప్రేమించడానికి చాలా ట్రై చేశాను కానీ నా మనసులో వేరే రూపం ఉంది. దూరంగా ఉన్నా ఎప్పటికీ తన మాటలు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయ్. అందుకే నీకు దగ్గర కాలేకపోతున్నా’ అని వసంత్ ఎమోషనల్ గా చెప్తాడు. నేను నిన్ను నిజాయితీగా ప్రేమించాను అని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని నిధి ఏడుస్తుంది. ఇందులో నీ తప్పేమీ లేదు అంతా నేనే చేశాను. నీ బాధకి కారణం అవుతాను అని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను. మనసులో ఒకరిని పెట్టుకుని బయట ఇంకోకరితో ఉండటం నా వల్ల కాదని వసంత్ చెప్తాడు.


Also Read: సామ్రాట్ జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ


షటప్ వసంత్.. నువ్వు నా గుండెని ముక్కలు చేశావ్.. నీలాంటి వాడిని నమ్మడం నాది తప్పు అని నిధి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏంటి రా వసంత్ ఏం జరుగుతుంది ఇక్కడ అని యష్ కోపంగా అడుగుతాడు. ఐ యామ్ సోరి రా అని అంటాడు. నిధితో పెళ్లి ఫిక్స్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా అని యష్ నిలదీస్తాడు. అప్పుడు నా ప్రేమ కంటే నువ్వు ఇచ్చిన మాటే ఎక్కువ అయిందని వసంత్ అంటాడు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి పరువు కూడా పోయిందని యష్ సీరియస్ అవుతాడు. ప్రేమ లేకుండా పెళ్లి ఎలా చేసుకొను, నా మనసులో నిధి లేదని వసంత్ అంటే మరి ఎవరున్నారని యష్ అడుగుతాడు. చిత్ర కోసం, నేను చిత్రని ప్రేమిస్తున్నా తను లేకుండా నేను బతకలేను అని వసంత్ చెప్పేస్తాడు. నోరు ముయ్ ఇంకోసారి అంటే చంపేస్తా అని కోపంగా అరుస్తాడు. నువ్వు ఎన్ని చెప్పినా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగడానికి వీల్లేదని యష్ అంటే నేను ఒప్పుకోను అని వసంత్ చెప్తాడు.


నీ మాటకి కట్టుబడితే నిధితో పాటు నేను ప్రేమించిన చిత్రకి కూడా అన్యాయం చేసినట్టు అవుతుంది. చిత్రకి బ్రేకప్ చెప్పినా నా ప్రేమని మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నా. చచ్చేవరకు తన ప్రేమలోనే నేను బతకగలను అని వసంత్ అంటాడు. పరాయి వాడు ఎప్పుడు స్వంత వాడు కాలేడని చాలా బాగా నిరూపించావ్, నిన్ను నా తమ్ముడిలాగా భావించాను నీకు ఏ సాయం కావాలన్నా ముందుకు వచ్చాను. కానీ నువ్వు నా నిర్ణయాన్ని తప్పు అని ప్రూవ్ చేశావ్ అని యష్ కొప్పడతాడు. నువ్వు అలా అనకు పరాయి వాడివి అంటే నాప్రాణం పోయేలా ఉంది. ఏదైనా చెప్పు కానీ ఈ పెళ్లి మాత్రం చేసుకోమని చెప్పకు, అంతకంటే నా ప్రాణం అయినా నీకు ఇచ్చేస్తాను అని వసంత్ ఎమోషనల్ గా మాట్లాడతాడు.


Also Read: దేవిని ఆదిత్యతో మాట్లాడమని ఒట్టు వేయించుకున్న చిన్మయి- షాక్లో మాధవ్, ఇల్లు విడిచి వెళ్ళనన్న రాధ


అన్న ఎప్పుడు తమ్ముడు ప్రాణం కావాలని కోరుకొడు రా.. చిత్ర మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నీ నోటితో చెప్పించాలనే ఈ ఫెక్ ఎంగేజ్మెంట్ అని యష్ నిజం బయటపెట్టేస్తాడు. ఆ మాట విని వేద షాక్ అవుతుంది. నీ కోసం అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది ఒక అబద్ధాని నిజం అని చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టానో చూడు, నువ్వు దూరం అయిపోతుందనుకుంటున్న చిత్ర, వైభవ్ కూడా డ్రామానే నేను ఆలోచించినట్టే మీ వదిన కూడా ఆలోచించింది. మీ ఇద్దరి ప్రేమ అందరికీ తెలియాలనే మిమ్మల్ని కలపాలనే ఈ నాటకం. మీ పెళ్లి చెయ్యలని మీ వదిన నా దగ్గర మాట తీసుకుంది తనకి ఇచ్చిన మాట నేను తప్పనని యష్ అంటాడు. వసంత్, చిత్రని యష్ కలుపుతాడు. యష్ ని వేద చాలా మురిపెంగా చూస్తూ థాంక్స్ చెప్తుంది.  


తరువాయి భాగంలో..


వేద ప్రేమ లేఖ రాస్తుంటే.. మాళవిక హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. నిమిషం పట్టదు నా సూసైడ్ కి నువ్వే కారణం అని యష్ తో మాళవిక అంటుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని మాళవిక యష్ ని బెదిరిస్తుంది.