Goddess chandraghanta: శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో పూజిస్తారు. అయితే ఏ ఆలయంలో ఉండే అమ్మవారికి ఆ రూపం మొదటగా వేసి ఆ తర్వాత అలంకారాలు మారుస్తారు. కానీ వాస్తవానికి భక్తులు ఫాలో కావాల్సినవరి నవదుర్గల రూపాలే అని చెబుతారు. నవదుర్గల్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి కాగా..మూడో రోజు చంద్రఘంటగా దర్శనమిస్తోంది శ్రీశైలం భ్రమరాంబిక


చంద్రఘంట అనే పేరెలా వచ్చింది
శివుడి శిరస్సున ఉన్న చంద్రుడిని చూసి ముచ్చటపడ్డ పార్వతీదేవి కోరిక తీర్చేందుకు ఆ చంద్రుడిని ఆమెకు అలంకరించాడట శంకరుడు. ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంతో ఆమెకు చంద్రఘంట అని పేరు. వ్యాఘ్ర వాహనధారియై పది చేతుల్లో అస్త్రాలనూ కమలాన్నీ కమండలాన్నీ ధరించి మూడో నేత్రాన్ని తెరిచి యుద్ధానికి సన్నద్ధమైన ముద్రలో ఉన్న అమ్మ ఘంటానాదం విన్నంతనే రాక్షసులు గడగడలాడారట. చేతుల్లో పది ఆయుధాలను మోసుకెళ్లేదిగా, దుష్ట శక్తులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నట్లుగా ఉన్నరూపమే చంద్రఘంట. తన భక్తులపై కరుణ కలిగిఉండి బాధలు తీర్చేందుకు క్షణంలో వచ్చే అమ్మను దర్శించుకంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని భక్తులకు ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది చంద్రఘంటా దేవి.


Also Read: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద


చంద్రఘంట దేవి పూజ ప్రాముఖ్యత 
చంద్రఘంట దేవిని పూజించడం వల్ల భయాలను తొలగి..బతుకుపై ఆశ, విశ్వాసం పెరుగుతుంది. అమ్మవారి నుదుటి మీద ఉన్న చంద్రుని గంట ధ్వని ఆత్మలను చెడు శక్తులను పారద్రోలేదిగా ఉంటుంది. అందుకే చంద్రఘంటను పూజించే ఇంట్లో ప్రతికూల శక్తులు చేరవు.  జీవితంలో వృత్తి లేదా వ్యాపార రంగాల్లో ఆశలను కోల్పోయిన సమయంలో చంద్రఘంట పూజను చేయడం వల్ల నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని పండితులు చెబుతారు.


చంద్రఘంట దేవి మంత్రం
ఓం దేవి చంద్రగుటాయై నమః
ఓం దేవి చంద్రగుటాయై నమః పిండాజ్ ప్రవార్ధ్ చండ్కోపష్ర్కైర్యుట
ప్రసాదమ్ తనుతే మధ్యమ్ చంద్రఘంటేటి విశృతా


చంద్రఘంట దేవి ప్రార్థన 
పిండజా ప్రవారారుధ చండకోపస్త్రకైర్యుట
ప్రసాదమ్ తనుతే మహ్యం చంద్రఘంటేటి విశృతా !


చంద్రఘంట దేవి స్తుతి 
యా దేవి సర్వభూతేషూ మా చంద్రఘంట రూపేనా సమస్తిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


చంద్రఘంట దేవి ధ్యానం 
వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం
సింహరుధ చంద్రఘంట యశస్వినీమ్
మణిపురా స్థితం తృతీయ దుర్గ త్రినేత్రం
ఖంగా, గధ, త్రిశూల, చపశార, పద్మ కమండాలు మాల వరభిటకరం
పటంబరా పరిధానమ్ మృదుహస్య నానాలంకర భూషితాం
మంజీర, హర, కేయూర, కింకిని, రత్నకుండల మండితాం
ప్రపుల్ల వందన బిబాధర కంట కపోలమ్ తుగమ్ కుచాం
కమనీయం లావణ్యం క్షినకటి నితంబానిమ్


Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!


చంద్రఘంట దేవి స్తోత్రం
అపదుద్ధహారిని త్వంహి అధ్య శక్తిః శుభ్పరం
అనిమది సిద్ధిధాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం
చంద్రముఖి ఇష్ట ధాత్రి ఇష్టం మంత్ర స్వరూపిణి
ధానదాత్రి, ఆనందధాత్రి, చంద్రఘంటే ప్రణమామ్యహం
నానారూపధారిణి ఇచ్ఛమయి ఐశ్వర్యదాయిని
సైభగ్యరోగ్యదాయిని చంద్రఘంటే ప్రణమామ్యహం


చంద్రఘంట దేవి కవచం 
రహస్యం శ్రిను వక్ష్యామి షైవేశి కమలనానే
శ్రీ చంద్రఘంటేస్య కవచమ్ సర్వసిద్ధిదాయకం
బినా న్యాసం బినా వినియోగం బినా శపోద్ధ బినా హోమం
స్నానం శౌచది నాస్తి శ్రద్ధమత్రేన సిద్ధిదం
కుషిష్యం కుటిలయ వంచకాయ నిందకాయ చా
నా దతవ్యం న దతవ్యం న దతవ్యం కదచితాం