Navratri 2022 : శ్రీశైల భ్రమరాంభిక రెండవ అవతారం  బ్రహ్మచారిణి...
  ధ్యానం
''బ్రహ్మాచారిణి'' దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ
 దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!


బ్రహ్మ  అంటే అన్నీ తెలిసినదని అర్థం. బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ స్వరూపం ఇలా బ్రహ్మ అంటే అన్నీ అనే అర్థాన్ని నింపుకుని అన్ని తనలోనే నింపుకున్నది అని కూడా అర్థం. చారిణి అంటే కదలడం , ఒక పనిలో నిమగ్నమవడం. మొత్తంగా బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నదని అర్ధం. నవరాత్రులలో అమ్మవారిని రెండో రోజు బ్రహ్మచారిణిగా పూజిస్తారు. బ్రహ్మచారిణీ దేవి బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను చేకూరుస్తుంది.


బ్రహ్మచారిణి అవతారం వెనుకున్న కథ
మేనక, హిమవంతుల కుమార్తె పార్వతీ దేవి శివుడిపై ప్రేమను పెంచుకుని నిత్యం పూజిస్తుంటుంది. శివుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.  అయితే ఆమె తల్లిదండ్రులు శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పని, అది జరగని పని అని  చెబుతారు. అయినా పట్టువిడవని పార్వతీదేవి..శివుడి కోసం 5వేల సంవత్సరాలు  తపస్సు చేస్తుంది. అయినా శివుడి మనస్సు కరగలేదు. 


Also Read: ఈ వారం ఈ రాశులవారికి స్థిరాస్తి వ్వవహారాలు కలిసొస్తాయి


శివుడిపై మన్మధుడు పూలబాణం
మరోవైపు శివుడు దక్షప్రజాపతి కుమార్తె సతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పుట్టింట్లో అవమానం భరించలేక అగ్నిలో దూకుతుంది. ఇక శివుడికి భార్య లేదని తెలుసుకున్న తారకాసురుడనే రాక్షసుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు ఉండకూడదనే వరం పొందుతాడు.ఆ అహంకారం వల్ల దేవతలను నానా హింసలు పెట్టేవాడు. అయితే  సతీదేవి పార్వతీ  దేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన  దేవతలంతా... పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని  మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసి శివుడిలో చలనం తీసుకురావాలని చూసిన మన్మధుడిని మూడోకన్ను తెరిచి భస్మం చేస్తాడు శివుడు. అయినప్పటీ పార్వతీ దేవి ఆలోచనలో ఎలాంటి మార్పు రాదు పైగా మరింత ఘోర తపస్సు చేస్తుంది...


Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం


తాను దొంగ సన్యాసిని అని నింద వేసుకున్న శివుడు
సన్యాసినిగా  తిరుగుతూ తన ధ్యాసలోనే ఉన్న పార్వతి మీద ప్రేమ పెంచుకుంటాడు శివుడు.  సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించిన శివుడు ...తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ తన మీద తనే నింద వేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సును ఇంకా తీవ్రతరం చేస్తుంది. చివరికి  పార్వతి ప్రేమకు కరిగిన శివయ్య పార్వతిని పెళ్లిచేసుకుంటాడు. అలా అమ్మవారు బ్రహ్మచారిణీ స్వరూపిణిగా అవతరించి సౌభాగ్యవంతురాలిగా మారుతుంది


శరన్నవరాత్రుల్లో ఒక్కో ఆలయంలో రోజుకో ఒక్కో అవతారం వేస్తుంటారు తొమ్మిదిరోజుల పాటూ...కానీ అసలైన అవతారాలంటే నవదుర్గలే అంటారు పండితులు. నవదుర్గల అలంకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో దర్శించుకోవచ్చు...