Foods for Heart Health : హై బీపీ (High Blood Pressure) లేదా బీపీతో ఆరోగ్యానికి చాలా డేంజర్ అని చెప్తారు నిపుణులు. దీనిని సైలంట్ కిల్లర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే దానివల్ల కలిగే ప్రభావాలు ప్రాణాలను హరిస్తాయి. హెల్తీ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, మద్యం ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు బీపీకి కారణమవుతాయి. దీనివల్ల మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, స్లీప్ ఆప్నియా వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. బీపీని కంట్రోల్ చేయకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. అందుకే దీనిని కంట్రోల్ చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు. 


బీపీ కంట్రోల్ చేయడంలో మెడిసిన్​తో పాటు.. కొన్ని ఫుడ్స్​ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. వాటిని రెగ్యూలర్​గా డైట్​లో తీసుకుంటే బీపీ కంట్రోల్​లో ఉండడంతో పాటు గుండె సమస్యలు తగ్గుతాయంటున్నారు. దీనికోసం ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉండే హెల్తీ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలంటున్నారు. సహజంగా దొరికే ఫుడ్స్​తో బీపీని ఎలా కంట్రోల్ చేయవచ్చో. గుండె ఆరోగ్యానికి ఏది మంచిదో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫ్రూట్స్, వెజిటేబుల్స్


పండ్లు, కూరగాయల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. ఇవి బరువును కంట్రోల్ చేయడంలో సహాయం చేయడంతో పాటు.. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. బచ్చలికూర వంటి ఆకు కూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. బెర్రీలు, అరటిపండ్లు, నారింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 



మిల్లెట్స్


క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను డైట్​లో చేర్చుకోవాలట. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తనాళాల పని తీరును మెరుగుపరిచి.. కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. వీటిలో బి విటమిన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి హార్ట్​ హెల్త్​ని ప్రమోట్ చేసి.. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. 



ప్రోటీన్లు


స్కిన్​లెస్ పౌల్ట్రీ, చేపలు, బీన్స్ వంటి కాయధాన్యాలు లీన్ ప్రోటీన్​కు మంచి సోర్స్. వీటిలో సంతృప్తి కొవ్వులు తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 



నట్స్​


బాదం, వాల్​నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి వాటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్​ను తగ్గించి.. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యూలర్​గా వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 


మిల్క్ ప్రొడెక్ట్స్


పాలను డైట్​లో చేర్చుకోవాలంటే లో ఫ్యాట్ మిల్క్​ను తీసుకోవచ్చు. ఎందుకంటే లో ఫ్యాట్ మిల్క్​ తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. వీటిలో కాల్షియం, పొటాషియం ఉంటుంది. కాల్షియం రక్తనాళలను కంట్రోల్​ చేస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. లో ఫ్యాట్ మిల్క్​ సంతృప్త కొవ్వును తగ్గించి గుండెను హెల్తీగా ఉంచుతుంది. 



చిక్కుళ్లు


బీన్స్, చిక్​పీస్, కాయధాన్యాల్లో డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. వీటిలోని లో ఫ్యాట్ గుండె ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. 


స్పైస్​లు


వెల్లుల్లి, తులసి, కొత్తిమీర వంటి మూలికలను డైట్​లో చేర్చుకోవచ్చు. ఉప్పును ఎక్కువగా వేసుకోకుండా.. రుచిని వీటితో పెంచుకోవచ్చు. ముఖ్యంగా వెల్లుల్లి యాంటీ హైపెర్టెన్సివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. వీటితో సోడియం తగ్గించుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. 



ఇవి పూర్తిగా అవగాహన కోసమే. వీటిని డైట్​లో చేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తూ.. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే.. కచ్చితంగా రక్తపోటు కంట్రోల్ అవ్వడంతో పాటు.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


Also Read : ఈ ఫ్రూట్స్ రెగ్యూలర్​గా నెలరోజులు తింటే ఏమవుతుందో తెలుసా? బరువు తగ్గేందుకు అది బెస్ట్