New Study On Walking Benchmarks : ఈ మధ్యకాలంలో వాకింగ్ బెనిఫిట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే రోజుకు 10,000 అడుగులు వేయాల్సిందే అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. అయితే రోజుకు పదివేల అడుగులు వేస్తే మంచిదే కానీ.. ఆరోగ్య ప్రయోజనాల కోసం అంత నడవాల్సిన పని లేదని చెప్తోంది తాజా అధ్యయనం. మరి రోజుకు ఎంత నడిస్తే సరిపోతుంది. ఎంత నడవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నడక మంచిదే. కానీ పదివేల టార్గెట్ కొందరికి సులభంగా ఉండొచ్చు. మరికొందరికి కష్టంగా ఉండొచ్చు. పదివేల అడుగులు వేస్తేనే ఆరోగ్యానికి మంచిదనుకునేవాళ్లు కూడా ఉన్నారు. దీనికోసమే స్మార్ట్ వాచ్​లు, ట్రాకర్స్ ఉపయోగిస్తున్నారు. కాస్త అడుగులు తక్కువైతే డిజప్పాయింట్ అయిపోతున్నారు. అయితే ఈ విషయంపైనే తాజా అధ్యయనం చేశారు. రోజుకు పదివేలు నడిస్తే పెద్ద ప్రయోజనం లేదని.. 7500 అడుగులతో కూడా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది.  

రీసెంట్ స్టడీ ఏమి చెప్పిందంటే.. 

వాకింగ్ చేయాలనుకునేవారికి 10,000 అడుగులు అనేది కరెక్ట్ బెంచ్​మార్క్ కాదని తాజా అధ్యయనం తెలిపింది. దానికంటే తక్కువ అడుగులు నడవడం వల్ల ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలు అందుతాయని నిరూపించింది. JAMA నెట్​వర్క్​ చేసిన పరిశోధన ప్రకారం రోజుకు 7500 అడుగుల కంటే ఎక్కవ నడవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉండవట. 7500 అడుగులు నడిస్తే డిప్రెషన్ ప్రమాదం 42 శాతం తగ్గుతుందని చెప్తున్నారు. దానికి మించి ఎంత నడిచిన ప్రయోజనాలనేవి పెద్దగా ఉండవని తేల్చి చెప్పింది. 

శారీరక శ్రమపై డిప్రెషన్ కూడా ఆధారపడి ఉంటుందట. అందుకే శారీరక శ్రమ అనేది వాస్తవికంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. అధికంగా నడవడానికి ప్రయత్నించినప్పుడు మానసిక, శారీరక ఒత్తిడికి దారి తీయొచ్చని.. దీనివల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చని చెప్తున్నారు. 7,500 అడుగులను తక్కువ వ్యవధిలో చురుకుగా నడిస్తే ఆ ఎఫర్ట్ సరిపోతుందని చెప్తున్నారు. పదివేల అడుగులు ఎక్కువ సేపు నెమ్మదిగా నడవడం కంటే ఇది బెస్ట్ అని తాజా అధ్యయనం ద్వారా తెలిపారు. 

యూకేలోని హెర్ట్​ఫోర్డ్​షైర్ యూనివర్సిటీ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. పదివేల అడుగులు అనేది ఆరోగ్య భద్రతను తప్పుదారి పట్టిస్తుందని తెలిపి.. రోజూ 4,400 అడుగులు నడిస్తే ఆయుష్షు పెంచుతుందని వారి పరిశోధనలో నిరూపించారు. రోజుకు 8,000 అడుగులు నడవడం వల్ల అకాల మరణాల ప్రమాదం దూరమవుతుంది మరో అధ్యయనం నిరూపించింది. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే నడక అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అద్భుతమైన మార్గం. కాబట్టి మంచి

ప్రయోజనాల కోసం మీరు పదివేల అడుగులు వేయాల్సిన అవసరం లేదు. తక్కువ నడిచినా.. ఎఫెక్టివ్​గా ఉండే విధానాన్ని ఎంచుకోవాలి. రోజుకు అరగంట ఎఫెక్టివ్​గా నడవండి. పది నిమిషాలు వాక్ చేసి.. చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వాక్ చేయండి. దీనివల్ల మీ బ్లడ్​ ఫ్లో మెరుగై.. మరింత ఎఫెక్టివ్​గా ప్రయోజనాలు చూడొచ్చు. 

Also Read : వ్యాయామం, డైట్ చేయలేకపోతున్నారా? అయితే బరువు తగ్గేందుకు ఆ​ ఒక్కటి మానేసి చూడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.