Happy Living in 2024: కొత్త ఏడాది వస్తుందంటే ఎన్నో కొత్త అలవాట్లను.. పనులు చేసేద్దామని ప్లాన్ చేసుకుంటాం. కానీ, అవన్నీ కుదరవు. అయితే, ప్రయత్నిస్తే తప్పులేదు. ముఖ్యంగా మన జీవితం హాయిగా సాగిపోవాలంటే తప్పకుండా అనుకున్నవి అమలు చేసి తీరాలి. కాబట్టి, మీ జీవితాన్ని మార్చేసే కొన్ని అలవాట్లను అలవరచుకోండి. తప్పకుండా ఈ న్యూ ఇయర్ హ్యాపీగా సాగిపోతుంది.


కొత్త విషయాలను నేర్చుకోండి:


జ్ఞానం కోసం తపన ఎప్పటికీ ఆగకూడదు. నిరంతర అభ్యాసం మనస్సును ఉత్సాహంగా ఉంచుతుంది. కొత్త సబ్జెక్టులు, నైపుణ్యాలు నేర్చుకోండి. పరిశోధనాత్మక మనస్సు వ్యక్తిగత ఉన్నతికి మార్గం చూపుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత లోతైన అవగాహన ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. 


స్ఫూర్తితో ముందుకు సాగండి:


దృఢత్వమే సాధనకు మూలస్తంభం. ఎదురుదెబ్బలను ఎదుర్కొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా మీలో స్పూర్తిని పెంపొందించుకోండి. వైఫల్యం అనేది డెడ్-ఎండ్ కాదు. తప్పులను మీ ప్రయాణంలో కీలకమైన భాగాలుగా స్వీకరించండి. ప్రతి పొరపాటు.. ఎన్నో కొత్త విషయాలను నేర్పుతుంది. మనల్ని మరింత బలోపేతం చేస్తుంది.


వాస్తవికత తెలుసుకోండి:


మీ పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు.. స్వీయ-వాస్తవికత వైపు ప్రయాణం చేయాలి. మీ అభిరుచులకు అనుగుణంగా సాహసోపేతమైన, ఇంకా సాధించగల లక్ష్యాలను ఏర్పరచుకోండి. మీరు ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. నిర్దేశించని ప్రాంతాలను అన్వేషిస్తారు.


ధైర్యంగా ముందడుగు వేయండి:


మీ కంఫర్ట్ జోన్ దాటి అడుగు వేయడానికి ధైర్యం చేయండి. ఏదో ఉన్నామా అన్నట్లు కాకుండా.. ప్రతి విషయంలోనూ యాక్టివ్ గా ఉండండి. ఊహలను సవాలు చేసే అనుభవాలను వెతకండి. పరిధులను విస్తృతం చేసి.. రోజువారీ జీవితంలో చైతన్యాన్ని నింపండి.


సమయం ఎంతో విలువైనది:


ఈ రోజుల్లో సమయం నిధి కంటే విలువైంది. అది మీ జీవితాన్ని సూచిస్తుంది. మీరు గడిపే రోజు అర్థవంతంగా.. ఫలవంతంగా ఉండే విధంగా రూపొందించుకోండి. అభిరుచులు, సంబంధాలు, స్వీయ సంరక్షణ కోసం సమయాన్ని కేటాయించండి.  


దైనందిన కార్యక్రమాలలోపాల్గొనండి:


మీరు కాఫీ తాగుతున్నా.. ఇతరులతో మాట్లాడుతున్నా.. అందులో లీనమవ్వడం నేర్చుకోండి. ఇతరులు చెప్పేది వినండి. మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి.


అభిరుచికి తగినట్లు ముందుకు సాగండి:


అభిరుచి అనేది లక్ష్యాన్ని నడిపించే ఇంధనం వంటిది. అభిరుచి మీలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీస్తుంది. ఒత్తిళ్ల నుంచి బయట పడేస్తుంది. 


ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమకు ప్రాధాన్యత:


ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోండి. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రోజంతా చురుగ్గా ఉండవచ్చు.


Also Read : ఒక్క ఏడాదిలో ఇడ్లీ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. బిర్యానీలో కూడా మనమే టాప్












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.