Aliv Seeds Benefits : బరువు తగ్గుతూ.. జుట్టు పెరిగే మార్గాల కోసం మీరు ఎదురుచూస్తుంటే మీకోసం ఇక్కడ ఓ సూపర్ ఫుడ్ ఉంది. పోషకాలకు పవర్‌హౌస్ అయిన ఈ విత్తనం బరువు తగ్గడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పూర్తి సామర్థ్యంతో పని చేస్తుంది. ఇంతకీ ఆ సూపర్‌ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? అదే అలివ్ విత్తనం. ఆయుర్వేదంలో అంతగా ప్రసిద్ధి చెందని గొప్ప ఔషదాలలో ఇది ఒకటి. ఇది మీకు మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీనినే హలీమ్ సీడ్స్ లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్ అని కూడా అంటారు.
ఈ హాలిమ్ సీడ్స్ చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఇవి శక్తివంతమైన పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని శతాబ్ధాలుగా సంప్రాదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దాని ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా మీ డైట్లో రెగ్యూలర్‌గా చేర్చుకుంటారు. కాబట్టి దీనిని మీరు ఏదైనా ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? బరువు ఎలా తగ్గవచ్చు? డైట్లో ఎలా చేర్చుకోవాలో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు
అలివ్ సీడ్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. ముఖ్యంగా కొత్త జుట్టు రావడంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీటిలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అన్ని పదార్థాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వులు ఉంటాయి. కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటిమిన్ ఇ, ప్రోటీన్, ఐరన్, ఫోలిక్ యాసిడి వంటి పోషకాలు జుట్టు పెరుగుదలతో పాటు మొత్తం జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గడానికి..
అలివ్ విత్తనాల్లో ప్రోటీన్, డైటరీ ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బురువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. వీటిలోని ప్రోటీన్ కంటెంట్ మీరు కడుపు నిండుగా ఉండేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల అతిగా తినడం కంట్రోల్ అవుతుంది. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించి మెరుగైన జీవక్రియను ప్రోత్సాహిస్తుంది.
డైట్లో ఎలా చేర్చుకోవాలంటే..
అలివ్ సీడ్స్‌ను వారానికి మూడు సార్లు.. అర టీస్పూన్‌తో ప్రారంభించి.. వాటిని పాలు, లస్సీ లేదా స్నూతీస్లో కలిపి తీసుకోవచ్చు. భోజనానికి 15 నిమిషాల ముందు నిమ్మకాయ నీటితో కలిపి తాగవచ్చు. స్ప్రౌట్స్ వంటి సలాడ్స్‌లలో దీనిని తీసుకోవచ్చు. ఇది వాటి ప్రయోజనాలు ఆస్వాదించేందుకు గొప్ప మార్గంగా చెప్పవచ్చు. కొబ్బరి నీరు లేదా పాలు వంటి తక్కువ కేలరీలు కలిగి ఉన్న ఫుడ్‌తో అలివ్ విత్తనాలు తీసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. లిమిటెడ్‌గా తీసుకుంటేనే దీని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
Also Read : న్యూ ఇయర్ కోసం క్యారెట్ వాల్నట్ బర్ఫీ.. ఇంట్లోనే సింపుల్‌గా చేసేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.