Best Bikes Launched in 2023: 2023 సంవత్సరం మోటార్‌సైకిల్ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇందులో అనేక హై పెర్ఫామెన్స్ బైక్‌లు సెగ్మెంట్‌లోకి ప్రవేశించాయి. ప్రీమియం సెగ్మెంట్ బైకుల అమ్మకాలు కూడా విజృంభించడంతో చాలా మంది ఆటోమేకర్లు ఈ విభాగంలోకి ప్రవేశించారు.


ట్రయంఫ్ స్పీడ్ 400/ స్క్రాంబ్లర్ 400ఎక్స్
ఈ రెండు కూడా ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఉన్నాయి అనడంలో సందేహం లేదు. లాంచ్ అయిన తర్వాత వాటి ధరలు దాదాపు సమానంగానే ఉన్నాయి. లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది 398 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 40 హెచ్‌పీ పవర్‌ను, 6,500 ఆర్పీఎం వద్ద 37.5 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాని ఫిట్, ఫినిషింగ్‌తో ఇది మీరు పెట్టే డబ్బుకు ఉత్తమమైన విలువ అందిస్తుంది.


హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210
హీరో కరిజ్మా అనేది ఒకప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు కంపెనీ 2023లో దీన్ని తిరిగి మార్కెట్‌లోకి తెచ్చింది. దీని స్టైలింగ్ కూడా అద్భుతంగా ఉంది. అయితే ఇంజిన్ మాత్రం పూర్తిగా కొత్తది. 210 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 9,250 ఆర్పీఎం వద్ద 25.5 హెచ్‌పీ పవర్‌ని, 7,250 ఆర్పీఎం వద్ద 20.4 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ఫీచర్లను కలిగి ఉంది.


కేటీయం 390 డ్యూక్
కొత్త డ్యూక్ 390 మునుపటి మోడల్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. అది షార్ప్, అగ్రెసివ్ లుక్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 45 హెచ్‌పీ పవర్, 39 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 399 సీసీ ఇంజన్‌తో సహా చాలా మార్పులు వచ్చాయి. కొత్త డ్యూక్ 390 దాని ధరలో లభించే అత్యంత శక్తివంతమైన బైక్‌లలో ఒకటి.


టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310
టీవీఎస్ ఫ్లాగ్‌షిప్ నేక్డ్ స్పోర్ట్స్ బైక్ మరింత శక్తి, మరింత టెక్నాలజీతో రానుంది. అయితే అగ్రెసివ్ స్టైలింగ్ కూడా దీని పెద్ద ఆకర్షణ. ఇది 312.12 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది. ఇది 9700 ఆర్పీఎం వద్ద 35 బీహెచ్‌పీ శక్తిని, 6650 ఆర్పీఎం వద్ద 28.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


మరోవైపు టెస్లా మనదేశంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2.4 శాతం మాత్రమే. అయితే మనదేశంలో ఈవీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను టెస్లా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే టెస్లా గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంపై చాలా చర్చ జరుగుతోంది. రాబోయే కొన్నేళ్లలో కంపెనీ తన వాహనాలను కూడా భారతీయ రోడ్లపైకి తీసుకురాగలదు. ప్రారంభంలో టెస్లా తన కార్లను సీబీయూ ద్వారా మనదేశంలోకి తీసుకువస్తుంది. అంటే పూర్తిగా వేరే దేశంలో రూపొంది మనదేశానికి ఇంపోర్ట్ అవుతాయన్న మాట. దీనికి సంబంధించిన టాక్స్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయి. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా తెలిపింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!