HP Recruitment 2022 : హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెక్నీషియన్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశాఖపట్నం రిఫైనరీలో 186 టెక్నిషీయన్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు https://hindustanpetroleum.com/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు. 






మొత్తం 186 పోస్టులు 



  • ఆపరేషన్స్‌ టెక్నీషియన్‌ - 94 ఖాళీలు 

  • బాయిలర్‌ టెక్నీషియన్‌ - 18 ఖాళీలు 

  • మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌(మెకానికల్) - 14 ఖాళీలు 

  • మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్) - 17 ఖాళీలు 

  • మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌(ఇన్ స్ట్రూమెంటేషన్) - 9 ఖాళీలు 

  • ల్యాబ్ ఎనలిస్ట్ - 16 ఖాళీలు 

  • జూనియర్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ - 18 ఖాళీలు 


Also Read : DTC Recruitment 2022: డిప్లొమాతో దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు


జీతం రూ. 55 వేలు 


టెక్నిషీయన్ల పోస్టులకు డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.55,000 జీతం ఇస్తారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.590 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించక్కర్లేదు. ఏప్రిల్‌ 22, 2022 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అవుతాయి. మే 21 చివరి తేదీ.  అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.  


Also Read : TS Police Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణ పోలీస్ శాఖలో మరో రెండు నోటిఫికేషన్లు జారీ