Akshaya Tritiya 2022 Offers: అక్షయ తృతీయ వచ్చేసింది! 2022, మే 3న ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున బంగారం, ప్లాటినం నగలను కొనుగోలు చేయడం వలన మంచి జరుగుతుందని చాలామంది విశ్వాసం. మహాలక్ష్మీ అమ్మవారు భక్తులను కరుణిస్తారని నమ్ముతున్నారు. ఇప్పటికే బంగారు, వెండి నగల కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ సైతం కొన్ని ఆఫర్లు ఇస్తోంది. కొనుగోలు చేసిన విలువపై రూ.2500-3000 వరకు క్యాష్ బ్యాక్‌ అందిస్తోంది.


అక్షయ తృతీయ ఆఫర్లను ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐదు రకాలుగా విభజించింది. నేషనల్‌, నార్త్, సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌ అని వర్గీకరించి ఆఫర్లు ఇస్తోంది. దేశ వ్యాప్తంగా చాలా మర్చంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మర్చంట్‌ను బట్టి మే 15 వరకు ఆఫర్‌ పరిమితి ఉంది.  అయితే 'బ్రాండ్‌ ఈఎంఐ' కింద పైన్‌ల్యాబ్స్‌ స్వైప్‌ మెషీన్‌లో చేసే లావాదేవీకే ఈ ఆఫర్లు వర్తిస్తాయట. ఛార్జ్‌స్లిప్‌ పైనా సత్వర డిస్కౌంట్‌ ఉండాలి. లావాదేవీ జరిగిన 180 రోజుల వరకు ఛార్జ్‌స్లిప్‌ను దగ్గర ఉంచుకోవాలి.


జాయ్‌ అలుకాస్‌ స్టోర్‌ లేదా ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌ ఇస్తున్నారు. కనీసం రూ.25,000 విలువైన లావాదేవీపై రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నారు. కల్యాణ్‌ జువెలర్స్‌లో ఫ్లాట్‌గా రూ.7000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. కనీసం రూ.100,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిలయన్స్‌ జువెల్స్‌లో 5 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తోంది. కనీస మొత్తం రూ.25,000 పెట్టి కొనుగోలు చేయాలి. రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నారు. ఆయా నగరాల్లోని ఇతర స్టోర్లలోనూ ఆఫర్లు వర్తిస్తున్నాయి.


డిస్‌క్లెయిమర్‌: ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఎస్‌బీఐ ఆఫర్లతో ఏబీపీకి ఎలాంటి సంబంధం లేదు. కస్టమర్లు కొనుగోలు చేసేముందు అన్ని వివరాలు కనుక్కోవడం బెస్ట్‌.