దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 


ఈ నోటిఫికేషన్ ద్వారా దిల్లీ ప్రభుత్వం 357 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌, అసిస్టెంట్‌ ఫిట్టర్, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏప్రిల్‌ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మే 4 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. 


డీటీసీ అసిస్టెంట్‌ రిక్రూట్‌మెంట్‌ 2022 వివరాలు 


పోస్ట్ పేరు :- అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌, అసిస్టెంట్‌ ఫిట్టర్, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, 


ఆర్గనైజేషన్:-  దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ 


అర్హత :- ఆటోమొబైల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐలో సంబంధిత విభాగంలో చదివి ఉండాలి. 


జాబ్‌ చేయాల్సిన ప్రదేశం :- దిల్లీ 
అనుభవం :-  నోటిఫికేషన్‌లో చెప్పినంత అనుభవం ఉండాలి 


అప్లికేషన్ స్వీకరణ తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే  :-  18 ఏప్రిల్‌ 2022
అప్లికేషన్ గడివు ముగిసే తేదీ :-   మే 4 2022


డీటీసీ రిక్రూట్‌మెంట్‌ 2022లో వయసు వివరాలు 


18 ఏళ్లు మించిన వారు 25 ఏళ్లకు మించని వారు ఎసిస్టెంట్‌ ఫిట్టర్‌ అండ్‌ ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.  అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌కు అప్లై చేయాలనుకునే వారి ఏజ్‌ 35 ఏళ్ల వరకు ఉండొచ్చు. మే 4 నాటికి ఈ ఏజ్‌ను లెక్కిస్తారు. 






అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ఉద్యోగాలు 112 ఉన్నాయి. దీనికి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైతే 46,374 రూపాయల జీతం వస్తుంది. 


అసిస్టెంట్‌ ఫిట్టర్‌లో 175 ఖాళీలు ఉన్నాయి. ఇసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్  విభాగంలో 70 పోస్టుల వేకెన్సీలు ఉన్నాయి. ఈ రెండు ఉద్యోగాలకు మినిమమ్‌ 17693 రూపాయల జీతం ఇస్తారు. 


ఎలా అప్లై చేయాలంటే
డీటీసీ వెబ్‌సైట్‌ లో ముందుగా రిజిస్ట్రేట్ చేసుకోవాలి. మే నాల్గో తేదీలోపు అప్లికేషన్లు సబ్‌మిట్ చేయాలి.