యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ తో పాటు ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 78 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేయాలి. 


అసిస్టెంట్ ఎడిటర్-1, అసిస్టెంట్ డైరెక్టర్-16, ఎకనామిక్ ఆఫీసర్-4, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, మెకానికల్ మెరైన్ ఇంజనీర్-1, లెక్చరర్-4, సైంటిస్ట్ 2, కెమిస్ట్ 5, జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్-36, రీసెర్చ్ ఆఫీసర్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్-7 పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు.


వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా విద్యార్హతలను ఉన్నాయి. విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో చుసుకోవాలి. 
అభ్యర్థులు అప్లై చేసే సమయంలో రూ.25ను అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ ఫీజును ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. అధికారిక వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి.


ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ప్రతీ పోస్టు పక్కన అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అభ్యర్థులు ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేయాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడొచ్చు.


Also Read: Hyderabad Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..


Also Read: AP Model School Jobs: మోడల్‌ స్కూళ్లలో 282 టీచర్‌ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల


Also Read: BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా? 


Also Read: APPSC Jobs Recruitment: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఉద్యోగాల వివరాలివే.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే


Also Read: NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్‌ తేదీలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన..


Also Read: Karnataka Sanskrit University: 100 ఎకరాల్లో రూ.300 కోట్లతో సంస్కృత విశ్వవిద్యాలయం.. మంగళవారం సీఎం శంకుస్థాపన


Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు