పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్! ప్రస్తుత ఆర్థిక ఏడాది (2021-22)కు గాను రూ.1.50 లక్షల కోట్లు రీఫండ్స్ జారీ చేశామని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇందులో 2021-22 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించి 1.1 కోట్ల రీఫండ్స్ కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.21,323 కోట్లుగా ఉంది.
'2021, ఏప్రిల్ 1 నుంచి 2022, జనవరి 3 వరకు 1.48 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (సీబీడీటీ) రూ.1,50,407 కోట్లకు పైగా రీఫండ్స్ విడుదల చేసింది' అని ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. ఇందులో 1.46 కోట్ల మందికి రూ.51,194 కోట్లు ఇన్‌కం టాక్స్ రీఫండ్స్ జారీ చేయగా 2.19 లక్షల మందికి కార్పొరేట్ టాక్స్ రీఫండ్ రూపంలో రూ.99,213 కోట్లు రీఫండ్ చేసింది.
2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే గడువు ముగిసిన సంగతి తెలిసిందే. 2021, డిసెంబర్ 31తో ఇది ముగిసింది. కరోనా మహమ్మారి, కొత్త ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్లో లోపాలు, సాంకేతిక ఇబ్బందుల వల్ల గడువును గతంలోనే రెండు సార్లు పెంచారు. ఆఖరి మూడు రోజుల్లోనే లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడం గమనార్హం.
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: DMart Q3 results: డీమార్ట్ అదుర్స్! భారీ లాభాలు ఆర్జించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్
Also Read: Satya Nadella: Growwలో పెట్టుబడి పెట్టిన Microsoft సీఈవో సత్య నాదెళ్ల