TS SI Hall Tickets 2022 : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల పరీక్షల తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను విడుతల వారీగా భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఇందులో ముందుగా పోలీస్‌ శాఖ ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7న నిర్వహిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్‌ టికెట్లు జులై 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 


503 పరీక్షా కేంద్రాల్లో 


అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. హాల్ టికెట్ల డౌన్ లోడ్ లో ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని తెలిపిది. లేదా 93937 11110, 939100 5006 నంబర్లను అభ్యర్థులు సంప్రదించవచ్చని బోర్డు వెల్లడించింది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 35 పట్టణాల్లో 503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు నిర్వహిస్తామని పోలీస్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షకు మొత్తం 2,47,217 మంది హాజరుకానున్నట్లు తెలిపింది.


ఎస్ఐ రాత పరీక్ష ఆగస్టు 7న 


తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షల తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 వేలకు పైగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. వీటిల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 6.50 లక్షల మంది, ఎస్ఐ ఉద్యోగాలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షల తేదీలను ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 7న, కానిస్టేబుల్‌ పరీక్షను ఆగస్టు 27వ తేదీన ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎస్ఐ పరీక్షల హాల్ టికెట్లు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లు ఆగస్టు 10వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ 


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. ఆగస్టు 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టుల సంఖ్య: 113



  • పోస్టుల కేటాయింపు: మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు.

  • అర్హత: డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌) లేదా డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

  • వయసు: 01.07.2022 నాటికి 21-39 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1983 – 01.07.2001 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎన్‌సీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంది.

  • జీతభత్యాలు: నెలకు రూ.45,960 -  రూ.1,24,150 చెల్లిస్తారు.

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

  • ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

  • పరీక్ష విధానం : మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1(జనరల్ స్టడీస్)లో 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2(ఆటోమోబైల్ ఇంజినీరింగ్–డిప్లొమా లెవల్)లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయించారు.

  • దరఖాస్తు, పరీక్ష ఫీజు : రూ.320 . ఇందులో దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


Also  Read : Management Trainee Jobs: కోల్ఇండియాలో 481 పోస్టులు - నోటిఫికేషన్ పూర్తి వివరాలు