కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ఇండియా సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 481  పోస్టులను భర్తీ చేయనుంది. 


వివరాలు.. 


* మేనేజ్‌మెంట్ ట్రైయినీ: 481 పోస్టులు.


రిజర్వేషన్ల వారీగా పోస్టులు: జనరల్–213, ఈడబ్ల్యూఎస్–47, ఎస్టీ–65, ఎస్టీలకు–34, ఓబీసీలకు (ఎన్సీఎల్)–122 కేటాయించారు.


విభాగాల వారీగా ఖాళీలు..
1) పర్సనల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌: 138 
2) ఎన్విరాన్‌మెంట్‌: 68
3) మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌: 115 
4) మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌: 17
5) కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌: 79
6) లీగల్: 54 
7) పబ్లిక్‌ రిలేషన్స్‌: 06 
8) కంపెనీ సెక్రటరీ: 04 


టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్- 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ పూర్తిచేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.


వయోపరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మే 31, 2022 నాటికి వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ కేటగిరీలో జనరల్-10 ఏళ్లు, ఓబీసీ–13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు అదనపు సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష రాసుకోవచ్చు. పరీక్షలో రెండు పేపర్లు(పేపర్–1, పేపర్–2) ఉంటాయి. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పేపరు 100 మార్కులకు ఉంటుంది.
* పేపర్–1 సంబంధించి జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, న్యూమరికల్ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ అంశాలు ఉంటాయి.
* పేపర్–2 ప్రొఫెషనల్ నాలెడ్జ్(సంబంధిత సబ్జెక్టుల్లో సంబంధించిన) విభాగం నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. 


ఇంజినీరింగ్‌తో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు- అమ్మాయిలూ అర్హులే!

అర్హత మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్అభ్యర్థులు ప్రతి పేపర్లోనూ 40 మార్కులు సాధించాలి. ఓబీసీ(నాన్క్రీమీలేయర్) అభ్యర్థులు ప్రతి పేపర్లోనూ 35 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 30 మార్కులు రావాలి. 


తుది ఎంపిక: ధ్రువపత్రాల పరిశీలన,  వైద్య పరీక్షల తర్వాత అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.


పరీక్ష కేంద్రాలు: ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో తెలియజేసిన పరీక్ష కేంద్రాలకు సంబంధించిన జాబితా ఉంటుంది. అందులో మూడు ప్రాధాన్యత కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత తిరిగి మార్పులకు అవకాశం ఉండదు. ఆన్‌లైన్(సీబీటీ) పరీక్షను ఎప్పుడు నిర్వహించేది ఈమెయిల్ ద్వారా పంపించే అడ్మిట్ కార్డులో తెలియజేస్తారు. సీబీటీలో అర్హత సాధించిన విద్యార్థులు పేర్ల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 07.08.2022


 


Notification


Website