ఇండియన్‌ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైయినింగ్‌ అకాడమీ ఏప్రిల్-2023 సంవత్సరానికి గాను 60వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్నికల్‌) మెన్‌, 31వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్నికల్‌) ఉమెన్‌ కోర్సు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైన అవివాహిత యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జులై 26న ప్రారంభమైంది. ఆగస్టు 24 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.


మొత్తం ఖాళీలు: 191

1) 60వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్: 175 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు...


* సివిల్- 49


* కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ- 42


* ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-17


* ఎలక్ట్రానిక్స్- 26


* మెకానికల్- 32


* Misc ఇంజినీరింగ్-09


2)  షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్స్: 14 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు...


*  సివిల్- 03


* కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ- 05


* ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-01


* ఎలక్ట్రానిక్స్- 02


* మెకానికల్- 03


* Misc ఇంజినీరింగ్-09


3) విడోస్‌ డిఫెన్స్‌ పర్సనల్‌: 02 పోస్టులు


విద్యార్హతలు: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ (బీటెక్‌/బీఈ) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ అభ్యర్థులు 2023, ఏప్రిల్ 1 లోపు ఇంజినీరింగ్ డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది. విడోస్ నాన్ టెక్నికల్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, టెక్నికల్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: 01.04.2023 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. విడోస్ అయితే 35 ఏళ్లలోపు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: చివరి సెమిస్టర్/ అకమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.07.2022


* ఆన్‌లైన్  దరఖాస్తుకు చివరి తేది: 24.08.2022


Notification


Online Application


Website