Police Dispute: ఓ చాక్లెట్ కోసం ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడ్డట్లుగా ప్రవర్తించారు ఓ ఇద్దరు పోలీసులు. అందరికీ బుద్ధులు చెప్పాల్సిన వాళ్లే బుద్ధి తక్కువగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్నామనే కనీసం బాధ్యత కూడా లేకుండా కొట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ.. పోలీసులను చూసి నవ్వుతున్నారు. ఓ అమ్మాయి కోసం వీళ్లు ఇలా కొట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉండి.. ఇలా చిల్లరగా ప్రవర్తించడం ఎంత వరకూ సమంజసం అని అంటున్నారు అయితే. అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


మహిళా కానిస్టేబుల్ కోసం సీఐ, కానిస్టేబుల్ గొడవ..


ఓ మహిళా కానిస్టేబుల్ కోసం సీఐ, కానిస్టేబుళ్లు గొడవకు దిగారు. స్టేషన్ లోనే వాగ్వాదానికి దిగారు. ఇద్దరికీ కోపం ఎక్కువ కావడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆపై మరింత కొట్టుకున్నారు. అక్కడున్న పోలీసులు ఆపాలని ప్రయత్నించినా ఎలాంటి లాభమూ లేకపోయింది. అయితే వీరిద్దరూ ఓ మహిళా కానిస్టేబుల్ కోసం కొట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. స్టేషన్ లోని మిగతా పోలీసుల ద్వారా విషయం పై అధికారులకు చేరింది. దీంతో వెంటనే పోలీసు అధికారులు రంగంలోకి దిగి.. సీఐతో పాటు కానిస్టేబుల్ ను ఏమైందని ప్రశ్నించారు. 


కొంచమైనా బుద్ధి ఉండాలయ్యా..!


ఇలా చిన్న పిల్లలా గొడవం పడడం ఏంటంటూ బుద్ధి చెప్పారు. అది కూడా ఓ అమ్మాయి కోసం.. పదవుల్లో ఉన్న మీరు ఇలా చేయకూడదంటూ చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ఉండంమంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సీఐ కృష్ణ భగవాన్ ను వీఆర్ కు పంపారు. స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కు కూడా బుద్ధి చెప్పారు. ఓ మహిళా కానిస్టేబుల్ కోసం డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు గొడవ పడడం చాలా చిన్నతనంగా ఉంటుందని వివరించారు. ప్రజలకు బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా బుద్ధితప్పి ప్రవర్తిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని సూచించారు. 


ఈ విషయంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. గొడవలు జరిగితే సర్ది చెప్పాల్సిన పోలీసులు అధికారులే గొడవం పడటం ఏంటని నవ్వుతున్నారు. అది కూడా ఓ అమ్మాయి కోసం డ్యూటీలో ఉండగానే కొట్టుకున్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఏవైనా పర్సనల్ విషయాలుంటే బయట చూస్కోవాలని కానీ... స్టేషన్ లోనే ఇలా గొడవ పడడం ఏంటంటూ అడుగుతున్నారు. ఏది ఏమైనా సీఐ, కానిస్టేబుల్ ఇలా కొట్టుకోవడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు. పోలీసులే ఇలా చేస్తుంటే ఇంక ఎవరూ పోలీస్ స్టేషన్ కు రారని... వాళ్ల మాట కూడా వనరని చెబుతున్నారు.