కుక్కలు, పిల్లులను ఎక్కువ మంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో చాలా అరుదుగా కొంత మంది సింహాలు, పులులను పెంచుకునేవారు కూడా ఉన్నారు. కాకపోతే ఒక సింహాన్ని కొనాలంటే బోలెడంత ఖర్చు. పైగా బొలెడన్నీ నియమాలు. కానీ పాకిస్తాన్లో మాత్రం సింహాలు చాలా చీప్ అయిపోయాయి. కనీసం ఒక ఆవు, గేదె చేసేంత ఖరీదు కూడా సింహాలు చేయడం లేదు. మరీ దారుణంగా ఖర్చుల కోసం వాటిని అమ్మేస్తున్నారు జూ నిర్వాహకులు. పాకిస్తాన్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. లాహోర్లోని సఫారీలో జూ కొన్ని సింహాలు ఉన్నాయి. వాటిని మన ఇండియన కరెన్సీ ప్రకారం యాభైవేల రూపాయలకు అమ్మేస్తున్నారు. లయన్స్ ఫర్ సేల్ అనే బోర్డు కూడా పెట్టినట్టు అక్కడి మీడియా కథనాలు ప్రచురిస్తోంది. 


గేదె కన్నా దారుణం...
పాకిస్తాన్లో ఒక గేదె కొనే ధరకు రెండు మూడు సింహాలను కొనేసే పరిస్థితి. అక్కడ ఆవు లేదా గేదె ధర లక్షా పది వేల రూపాయల నుంచి మూడు లక్షల ముప్పై అయిదు వేల రూపాయల దాకా ఉంది. కానీ సింహాన్ని మాత్రం యాభైవేల రూపాయలకే అమ్మడానికి రెడీ అయిపోయారు. కారణం గేదె, ఆవులు కనీసం పాలను ఇస్తాయి. వాటిని అమ్ముకుని బతకొచ్చు. కానీ జూలో ఉన్న సింహాలకు తిండి ఖర్చే విపరీతంగా అయిపోతున్నట్టు చెబుతున్నారు జూ నిర్వాహకులు. అందుకే గేదెలు, ఆవుల్ని ఉంచుకుని సింహాలను అమ్మేస్తున్నారు. 


పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉంది. పైగా జూకు జనాలు కూడా రావడం చాలా తగ్గిపోయింది. దీని వల్ల ఆదాయం కూడా పడిపోయింది. ఆ జూలో చాలా సింహాలు ఉన్నాయి. వాటికి ఆహారం పెట్టేందుకు చాలా ఖర్చు చేస్తోంది జూ యాజమాన్యం. కిలోల కొద్దీ మాంసాన్ని కొని మూడు పూటలా వాటికి పెట్టడం వల్ల నష్టాలు వస్తున్నాయి. ఒక్కో సింహం రోజుకు ఎనిమిది నుంచి తొమ్మది కిలోల మాంసాన్ని తింటాయి.  దీంతో సింహాలు అమ్ముతాం అంటూ బోర్టు పెట్టారు. వాటినెవరు కొనుక్కుంటారు? అని అనుకుంటున్నారా? ఇప్పటికే 14 సింహాలను అమ్మేశారు. వాటిని కొంతమంది కొని తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన వాళ్లంతా పెద్ద ఇళ్లు ఉన్నవారేనంట.  వాటి కోసం బోనులు, ఆహారం అన్నీ సమకూర్చగలిగిన వారే సింహాలను తమ ఇళ్లకు తీసుకెళ్లారు.


పాకిస్తాన్లో వన్య ప్రాణులను పెంచుకోకూడదనే నియమాలేమీ లేవు. చిరుతుల, పులులు, సింహాలను కూడా పెంచుకోవచ్చు. అప్పుడప్పుడు వన్యప్రాణి అధికారులు వచ్చి చూసి మరీ వెళతారు. కాకపోతే దాన్ని పోషించడం చాలా కష్టం కనుక బాగా ధనవంతులు మాత్రమే వాటిని కొని తీసుకెళతారు. పాకిస్తాన్లోనే కాదు చాలా దేశాల్లో సింహాలు, పులులను పెంపుడు జంతువులుగా పెంచుకునేందుకు అనుమతి ఉంది. 


Also read: మాస్ హిస్టీరియాతో తలలు బాదుకున్న విద్యార్థులు, అసలేంటి ఈ హిస్టీరియా? ఎందుకు వస్తుంది?


Also read: పిల్లల్లో పెరుగుతున్న టమోటో ఫీవర్ కేసులు, ఇది టమోటొలు తినడం వల్ల మాత్రం రాదు