Free coaching Exam for Police job Aspirants Telangana Police Jobs: పోలీస్ జాబ్స్ కోసం ట్రైనింగ్ తీసుకొనే స్తోమత మీకు లేదా? అయితే, అలాంటి వారి కోసం రాచకొండ పోలీసులు అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ, యువకులకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. నేడు ఫ్రీ టైనింగ్ కోసం ఎంపిక చేసేందుకు అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. 


గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.. 
ఏప్రిల్ 5న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి  5:30 గంటల మధ్య పరీక్ష నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిరకే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పోలీసులు అందుకు తగ్గట్లుగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌కు ఒక గంట ముందు అంటే 1:30 సమయానికి ఉండాలని పోలీసులు సూచించారు. రాచకొండ పరిధిలోని అభ్యర్థులకు ఈ అవకాశం కల్పించారు. పురుషులు 167.6 సెంటీ మీటర్లు, మహిళలు 152.5 సెంటీ మీటర్లకు పైబడి ఎత్తు ఉన్నవారు మాత్రమే అర్హులని పోలీసులు వెల్లడించారు. స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.






ఈ పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు ఇవి తప్పనిసరిగా పాటించాలి
1) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత ఎగ్జామ్ ప్యాడ్ తెచ్చుకోవాలి. ఎగ్జామ్ ప్యాడ్ తెచ్చుకోని వారిని పరీక్షకు హాజరు కానిచ్చేది లేదని స్పష్టం చేశారు.
2) ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలి
3) అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ పెన్ వెంట తెచ్చుకోవాలి
4) కొవిడ్19 నిబంధనల కారణంగా అభ్యర్థులు ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి
5) ఎగ్జామ్ హాల్‌లో మీ సెల్‌ఫోన్, స్మార్ట్ ఫోన్లు స్విచ్ఛాన్ చేయాలి
6) అభ్యర్థులు తాగునీరు (వాటర్ బాటిల్స్) వెంట తెచ్చుకోవాలి
7) మీ పేరు, హాల్ టికెట్ నెంబర్, తండ్రి పేరు తెలిసేలా ఉన్న స్కీన్ షాట్ తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్‌లో చూపించాలి.







పరీక్షా విధానం ఇదే..
అరిథమెటిక్ అండ్ రీజనింగ్ 100 ప్రశ్నలు , ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. జనరల్ స్టడీస్ లోనూ 100 ప్రశ్నలుంటాయి. ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. 


Also Read: పోలీస్ జాబ్‌కి ట్రై చేస్తున్నారా? ట్రైనింగ్‌కి డబ్బుల్లేవా? ఇక్కడ ఫ్రీ