Age Limit for Telangana Police Jobs 2022: తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త. పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు వయో పరిమితిని మరో రెండేళ్లు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.


కరోనా కారణంగా రెండేండ్ల అనిశ్చితి, తెలంగాణలో తొలిసారి 95% స్థానికత అమలులోకి రావడం దృష్ట్యా తెలంగాణ యువతీ, యువకులకు వయోపరిమితిని పెంచాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను, డిజిపి ఎం మహేందర్ రెడ్డిని ఆదేశించారు. నేటితో (మే 20న) అప్లికేషన్ గడువు ముగియనున్న నేప‌థ్యంలో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగించే విష‌యంపై తెలంగాణ ప్రభుత్వంగానీ, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డునుంచి గానీ స్ప‌ష్ట‌త రానుంది.






కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, ఎస్ఐ పోస్టులు 587ను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) భర్తీ చేయనుంది. పోలీసు ఎక్సైజ్, రవాణా విభాగంలో 677 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.  ఈ ఉద్యోగాలన్నింటికి దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభమైంది. పోలీస్ పోస్టులకు మే 2 న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, మే 20 రాత్రి తుది గడువు ముగియనుందని బోర్డ్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. 


టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ Official Link Of TSLPRB Website    


ముగియ‌నున్న ద‌ర‌ఖాస్తుల గ‌డువు
పోలీసు ఉద్యోగాల‌కు మే 20న ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగియ‌నుండగా.. నిన్న ఒక్క‌రోజే ల‌క్ష మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. నిన్న‌టి వ‌ర‌కు 5.2 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, దరఖాస్తుల సంఖ్య 6 ల‌క్ష‌ల‌కు చేరుకోనుంది. మహిళా అభ్య‌ర్థుల నుంచే 2. 05 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చా‌యని సమాచారం. శుక్ర‌వారం (20వ తేదీ) రాత్రి 10 గంటలతో అప్లికేషన్ గడువు ముగియనున్న క్రమంలో 2 ఏళ్లు వయో పరిమితి పెంచారు. కనుక దరఖాస్తు తుది గడువు పొడిగించే అవకాశం ఉంది. 


Also Read: TSLPRB Police Jobs 2022: తెలంగాణలో పోలీస్ జాబ్స్‌కు డైరెక్ట్ లింక్, పోస్టుల అర్హతల వివరాలు ఇవే