టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన తదుపరి సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో చేయబోతున్నారు. వీటిలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు రావడంతో టాలీవుడ్ హీరోలు ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


ఇప్పటికే ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్.. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పోస్టర్ ను వదిలారు. అది ఏ రేంజ్ లో ఉందో మాటల్లో చెప్పలేం. చాలా క్రూరంగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. పోస్టరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. 


కొన్నిరోజుల క్రితం ఈ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. అక్టోబర్ 2022లో సినిమా స్టార్ట్ అవుతుందని.. 'కేజీఎఫ్' రేంజ్‌లో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ నటించనున్న 31వ సినిమా ఇది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.


Also Read: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు