తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు సోమవారం (మే 2న) ఉదయం ప్రారంభమయ్యాయి. మొత్తం 17,291 పోలీసు ఉద్యోగాలకు నేటి నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, ఎస్ఐ పోస్టులు 587ను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) భర్తీ చేయనుంది. పోలీసు ఎక్సైజ్, రవాణా విభాగంలో 677 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటికి దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభమైంది. పోలీస్ పోస్టులకు మే 2 న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, మే 20 రాత్రి తుది గడువు ముగియనుందని బోర్డ్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ Official Link Of TSLPRB Website
పోలీస్ పోస్టులకు దరఖాస్తు విధానం ఇదే..
- మొదటగా అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి
- హోం పేజీలో కుడివైపు ఉన్న అప్లై ఆన్‌లైన్ (Click On Apply Online) మీద క్లిక్ చేయండి
- మీరు ఇదివరకు రిజిస్టర్ అవ్వకపోతే తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోండి. పేరు, పుట్టిన తేదీ, జెండర్, కమ్యూనిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ఇదివరకే రిజిస్టర్ అయిన అభ్యర్థులు తమ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ నింపాలి
- అందులో అడిగిన కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి, ఆ తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి.. చివరగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
పోలీసు జాబ్‌కు మీ అప్లికేషన్ పూర్తయ్యాక దరఖాస్తును పీడీఎఓఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.
ఎస్సై పోస్టులకు క్వాలిఫికేషన్స్ (Eligibility For SI Posts)
జులై 1వ తేదీ 2022 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి, కానీ 25 ఏళ్లు దాటకూడదు. అంటే 1997 జులై 2 కన్నా ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు.
ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయో పరిమితిలో 3 ఏళ్ల సడలించారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎస్సైతోపాటు స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ స్థానిక అభ్యర్థులు రూ. 1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
స్థానిక ఎస్సీ, ఎస్టీలు రూ.500, స్థానికేతరులు దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి.
కానిస్టేబుల్ పోస్టులకు అర్హతలు (Eligibility For Constable Posts)
2022 జులై 1వ తేదీకి 18 ఏళ్లు పూర్తయి 22 ఏళ్లు దాటకూడదు. అంటే 2000 జులై 2 కన్నా ముందు 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు.
హోంగార్డులు అయితే కనీసం 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. గరిష్ఠంగా 40 ఏళ్లు దాటకూడదు.
మహిళా కానిస్టేబుల్ (Civil, AR), మహిళా వార్డర్లకు మినహాయింపులు ఉన్నాయి. వితంతువులు, భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ వివాహం చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18 ఏళ్లు నిండి, గరిష్ఠంగా 40 ఏళ్లు మించకూడదు. ఇతర అన్ని కులాల్లో 18-35 మధ్య వయసు గలవారు అర్హులు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత.
ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానిక అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే.. ఎస్సీ, ఎస్టీలు రూ.400, స్థానికేతరులు రూ.800 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.