తెలంగాణలో వీఆర్ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోలను కూడా రద్దుచేసింది. జీవోల జారీకి ముందు ఉన్న యథాతథస్థితిని కొనసాగించాలని ఆగస్టు 10న హైకోర్టు ఆదేశించింది. అయితే వీఆర్‌ఏలను నిబంధనలను అనుసరించే క్రమబద్ధీకరించి, ఇతర శాఖల్లో సర్దుబాటు చేసినట్లు రెవెన్యూశాఖ హైకోర్టుకు నివేదించనున్నట్లు తెలిసింది. 


ఈ కేసుకు సంబంధించి రెవెన్యూశాఖ రెండు రోజుల క్రితం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసినట్లు తెలిసింది. ‌అర్హతలు ఉండి, దిగువస్థాయి పోస్టులో ఎన్నో ఏళ్లుగా వీఆర్‌ఏలుగా సేవలందిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల మేరకు, న్యాయపరమైన అంశాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే రెవెన్యూశాఖ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అందే నాటికే క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రకారం చాలా మంది వీఆర్‌ఏలు వారికి కేటాయించిన శాఖల్లో రిపోర్టు చేశారు. రెగ్యులర్‌ పదోన్నతులు, నియామకాలకు ఇది ఎంతమాత్రం ఆటంకం కాదు. పూర్తిగా సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లోనే వారిని సర్దుబాటు చేశాం. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ‌ ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఇంప్లీడ్‌ కావాలని వీఆర్‌ఏలు నిర్ణయించినట్లు తెలిసింది. ఏళ్ల తరబడి అందించిన సేవలు, ఇతర అర్హతలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం న్యాయసమ్మతంగానే ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టిందని వారంతా కోర్టుకు నివేదించనున్నారు.


తెలంగాణలో వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించాలన్న ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామాకాలను అడ్డుకోవాలని రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు ఆఫీస్‌ సబార్డినేట్‌లు హైకోర్టును ఆశ్రయించారు. జూనియర్‌ అసిస్టెంట్లుగా వీఆర్‌ఏల నియామకాన్ని ఆపాలని, దీనికి సంబంధించిన జీవో 81, 85లతో పాటు ఆగస్టు 5న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 30 మందికి పైగా ఆఫీస్ సబార్డినేట్‌లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 


రాష్ట్రంలోని వీఆర్ఏలకు పోస్టులను ఇవ్వడంపై తమకు అభ్యంతరంలేదని, అయితే తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ప్రతివాదులుగా సీఎస్, ఆర్థికశాఖ, రెవెన్యూ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీసీఎల్ఏలతోపాటు ముఖ్యమంత్రిని, ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా సృష్టించిన పోస్టుల్లో తమకు పదోన్నతులు కల్పించకుండా వీఆర్ఏలను నియమించడం తెలంగాణ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. 


ALSO READ:


గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం - ఈ తేదీల్లోనే!
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నిర్ణీత గడువులోగా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
లక్షలాది మంది విద్యార్థుల అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ ను రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి, TSPSC చైర్మన్, కార్యదర్శులతో ఈ విషయంపై చర్చించారు. తాజాగా టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీలలో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో మొత్తం 4 పేపర్ల పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్రూప్-2 పరీక్ష పూర్తి వివరాలను క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...