దివ్య, విక్రమ్ మాట్లాడుకోవడం బసవయ్య చూస్తాడు. ఇక రాజ్యలక్ష్మి, లాస్య తమ కష్టాల గోడు వెళ్లబోసుకుంటూ ఉంటారు. బసవయ్య వచ్చి దివ్య వాళ్ళు తలలు తలలు రాసుకుంటూ ఆడుకుంటున్నారని చెప్తాడు.
లాస్య: విక్రమ్ కి దివ్య అంటే పడి చావడం లేదు కదా
బసవయ్య: అది గది బయట మాత్రమే గదిలో కాదు. నేను నా కళ్ళతో చూశాను
లాస్య: కంట్రోల్ చేయాల్సింది విక్రమ్ ని కాదు దివ్యని
రాజ్యలక్ష్మి: హాస్పిటల్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి దివ్య సెగ తట్టుకోలేకపోతున్నా. తనని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి
బసవయ్య: ఇచ్చింది దొంగ విడాకులు నోటీసు అని.. ఇప్పించింది లాస్య అని తెలిస్తే నీ కొడుకు కూత మొదలుపెడతాడు
లాస్య: సలహా ఇచ్చినందుకు నన్ను ఇరికిస్తున్నారా
Also Read: మురారీకి భార్యగా మారిన ముకుంద- నందు చేసిన ప్రయత్నంతో కృష్ణకి మురారీ ప్రేమ తెలుస్తుందా?
రాజ్యలక్ష్మి: తులసిని దెబ్బ కొడితే కానీ దివ్య దారిలోకి రాదు. ఎలాగూ లక్కీ నీ దగ్గరే ఉన్నాడు. వాడిని అడ్డం పెట్టుకుని నందుకి దగ్గరవు. అప్పుడు తులసి గిలాగిలా కొట్టుకుంటుంది. కూతురి దృష్టి కూడా తల్లి మీదకి పోతుంది. వాళ్ళు వాళ్ళు తన్నుకు ఛస్తారు. ఈలోపు డైవర్స్ విషయం తేల్చేద్దాం
తులసి ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ తినడానికి కూర్చుంటారు. నందు మాత్రం డైటింగ్ అని చెప్పి తన ఫుడ్ వేరేగా చేయించుకుంటాడు. పరంధామయ్య తులసి చేతి వంట అద్భుతంగా ఉందంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అది తట్టుకోలేక నందు లోపలికి వెళ్లబోతుంటే రాములమ్మ గాలి తీసేస్తుంది. పచ్చి కూరగాయలు తినలేక చచ్చిపోతాడు. ఇక ఉండబట్టలేక తులసి చేసిన వంట తింటాడు. దొంగ తిండి తినడానికి డైటింగ్ ఎందుకని రాములమ్మ మళ్ళీ ఆడుకుంటుంది. నందుకి దగ్గరవమని రాజ్యలక్ష్మి ఇచ్చిన ప్లాన్ గురించి లాస్య ఆలోచిస్తుంది. కొడుకుని పావుగా వాడుకోవాలని చూస్తుంది.
లాస్య: నిన్ను డాడీకి దగ్గర చేయాలని నాకు ఉంది. కానీ వాళ్ళు రానివ్వరు. సవ్యంగా చేసే రానివ్వరు
లక్కీ: ఏదో ఒకటి చెయ్యి మమ్మీ నాకు డాడీ కావాలి అంటే లాస్య ఏదో ప్లాన్ చెప్తుంది. అది కష్టం కదా అంటాడు.
లాస్య: నువ్వు డాడీకి దగ్గరవడం ముఖ్యం అనేసరికి లక్కీ సరే అంటాడు. ఇక తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు తెగ ఉత్సాహపడుతుంది.
దివ్య తన మావయ్యని గార్డెన్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీ శ్రీమతి ఉంది ఆడుకోమని సలహా ఇస్తుంది. దివ్య, ప్రకాశం ఇన్ డైరెక్ట్ గా రాజ్యలక్ష్మిని తిట్టుకుంటూ మాట్లాడుకుంటారు. ఈ దివ్య తన పాలిట తీవ్రవాదిలా తయారైందని రాజ్యలక్ష్మి తిట్టుకుంటుంది. ఏదో ఒకరోజు మీ నాన్న లాగా నేను ధైర్యస్థుడుగా మారిపోతానని ప్రకాశం చెప్తాడు. రివర్స్ చేతబడి మొదలుపెట్టాను త్వరలోనే మాయలో నుంచి బయట పడేస్తానని విక్రమ్ గురించి చెప్తుంది.
రాజ్యలక్ష్మి: ఆపు నీ నాటకాలు. విక్రమ్ జీవితాంతం నా చెప్పు చేతల్లోనే ఉంటాడు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా చూడు.. నిన్ను హాస్పిటల్ లో అడుగు పెట్టనివ్వను
Also Read: కావ్యతో కారులో రాజ్ అంతరాత్మ సరసాలు- ప్రెగ్నెంట్ కాలేకపోయిన ఫ్రస్టేషన్ లో స్వప్న
దివ్య: వద్దు అత్తయ్యగారు భయమేస్తుంది ప్లీజ్ అత్తయ్య.. అంటాను అనుకుంటున్నావా అసలు అనను. మీరు నన్ను ఆపుతారో నేను మిమ్మల్ని ఆపుతానో చూస్తారు కదా
రాజ్యలక్ష్మి: నన్ను ఆపేంత మొనగత్తెవా
దివ్య: అత్త మొనగత్తె అయితే కోడలు మొండిగత్తె కాదు కోడలు కూడా మొనగత్తె అవుతుంది
రాజ్యలక్ష్మి: మీ మావయ్యని చూసి రెచ్చిపోతున్నావ్ చూపిస్తా నా తడాఖా
లాస్య లక్కీని తీసుకుని ప్లాన్ అమలు చేయడానికి చూస్తుంది. తప్పు చేస్తున్నామని లక్కీ అంటే లాస్య బెదిరిస్తుంది. దీంతో సరే ఏదైతే అది అయ్యింది డాడీ కోసం నువ్వు చెప్పినట్టే వింటానని మాట ఇస్తాడు. ఎవరికీ కనిపించకుండా లక్కీ తులసి ఇంట్లోకి వెళతాడు. మమ్మీ చెప్పేవరకు ఈ ఇంట్లో ఉండాలి కానీ దొరికిపోతే మాత్రం దబిడీ దిబిడే అనుకుంటాడు.